దీపావళి కానుకగా రానున్నహోండా బ్రయో ఆటోమేటిక్
అయితే, ఈ పండుగ సీజన్‌లో దీపావళి కానుకగా కార్ ప్రియులను అలరించేందుకు బ్రయోలో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ కలిగి వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే చిన్న కార్ సెగ్మెంట్లో మారుతి సుజుకి ఏ-స్టార్, హ్యుందాయ్ ఐ10 మోడళ్లు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో లభ్యమవుతున్న సంగతి తెలిసిందే. కాగా.. బ్రయో ఆటోమేటిక్ విడుదలైతే, ఈ సెగ్మెంట్లో ఇది మూడవ ఆటోమేటిక్ కారుగా నిలువనుంది.
ఇదిలా ఉండగా, ఈ నెలాఖరు నాటికి కొత్త బ్రాండ్ గుర్తింపుతో భారత కార్ల వ్యాపారంలోకి ప్రవేశించనున్నామని, శ్రీరాం గ్రూప్‌కు చెందిన ఉషా ఇంటర్నేషనల్‌తో జాయింట్ వెంచర్‌ను రద్దు చేసుకున్న తరువాత హోండా సియాల్ కార్స్ సంస్థ పేరును సైతం మార్చాలని నిర్ణయించామని హోండా ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమణ్ కుమార్ శర్మ తెలిపారు.
ప్రస్తుతం హోండా బ్రయో కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభ్యంవుతుంది. ఇందులో ఉపయోగించిన 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 88 పిఎస్‌ల శక్తిని, 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 18.4 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్ హోండా బ్రయో మైలేజ్, మ్యాన్యువల్ వేరియంట్ మైలేజ్ కన్నా తక్కువగా ఉండనుంది. రాష్ట్ర మార్కెట్లో అందుబాటులో ఉన్న హోండా బ్రయో వేరియంట్లు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* Honda Brio E MT - Rs. 414,000
* Honda Brio S MT - Rs. 452,000
* Honda Brio S(O) MT - Rs. 507,000
* Honda Brio V MT - Rs. 532,000
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)


Click it and Unblock the Notifications









