సిటీ, బ్రయోలపై భారీ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్న హోండా
ఇలా పండుగ సీజన్ ప్రారంభమైందో లేదో కార్ కంపెనీలు కొనుగోలుదారులను ఆకట్టుకొని తద్వారా అమ్మకాలను పెంచుకునేందుకు తమ ఉత్పత్తులపై వివిధ స్కీమ్‌లు, డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోవలోనే జపాన్‌కు చెందిన కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా అందిస్తున్న బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ హోండా సిటీ సెడాన్, హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్ మోడళ్లపై భారీ ప్రోత్సాహకాలను కంపెనీ ఆఫర్ చేస్తోంది.
ప్రస్తుతం పెట్రోల్ కార్ల మార్కెట్ ట్రెండ్ బలహీనంగా ఉండటం, దీనికి తోడు పండుగ సెంటిమెంట్ కూడా బలహీనంగా ఉండటంతో కంపెనీలు తప్పనిసరై భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. హోండా అందిస్తున్న సిటీ సెడాన్‌పై కంపెనీ రూ.40,000 విలువైన ప్రయోజనాలను ఆఫర్ చేస్తుండగా, బ్రయో హ్యాచ్‌బ్యాక్‌పై రూ.50,000 విలువైన ప్రయోయజనాలను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ స్కీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సమీపంలో హోండా కార్స్ డీలర్‌ను సంప్రదించండి.
హోండా సిటీ హైలైట్స్:
* స్టయిలిష్ లుక్‌నిచ్చే క్రోమ్ ఫ్రంట్ గ్రిల్
* ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
* క్రూయిజ్ కంట్రోల్
* ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్
* బ్రేక్ అసిస్ట్ ఈబిడితో కూడిన ఏబిఎస్
హోండా బ్రయో హైలైట్స్:
* 1.2 లీటర్ ఐ-విటెక్ ఇంజన్
* డ్యూయెల్ ఎస్ఆర్ ఎయిర్‌బ్యాగ్స్
* ఈబిడితో కూడిన ఏబిఎస్
* 18.4 కెఎమ్‌పిఎల్ మైలేజ్
* విశాలమైన డ్యూయెల్ టోన్ బీజ్ ఇంటీరియర్స్
రాష్ట్ర మార్కెట్లో హోండా సిటీ ప్రారంభ ధర రూ.7.37 లక్షల (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) నుంచి మొదలు కాగా, హోండా బ్రయో ప్రారంభ ధర రూ.4.14 లక్షల (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) నుంచి ప్రారంభమవుతోంది. హైదరాబాద్ మార్కెట్లో లభిస్తున్న సిటీ, బ్రయో వేరియంట్ల వాటి ధరల వివరాలు క్రింద విధంగా ఉన్నాయి:
హోండా సిటీ సెడాన్ వేరియంట్లు, ధరలు:
* హోండా సిటీ కార్పోరేట్ - రూ. 737,500
* హోండా సిటీ 1.5 ఈ ఎమ్‌టి - రూ. 796,000
* హోండా సిటీ 1.5 ఎస్ ఎమ్‌టి - రూ. 850,000
* హోండా సిటీ 1.5 వి ఎమ్‌టి - రూ. 903,500
* హోండా సిటీ ఎస్ ఏటి - రూ. 925,500
* హోండా సిటీ 1.5 వి ఏటి - రూ. 979,000
* హోండా సిటీ 1.5 వి ఎమ్‌టి సన్‌రూఫ్ - రూ. 989,000
* హోండా సిటీ 1.5 వి ఏటి సన్‌రూఫ్ - రూ. 1,064,500
హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్ వేరియంట్లు, ధరలు:
* హోండా బ్రయో ఈ ఎమ్‌టి - రూ. 414,000
* హోండా బ్రయో ఎస్ ఎమ్‌టి - రూ. 452,000
* హోండా బ్రయో ఎస్(ఏ) ఎమ్‌టి - రూ. 507,000
* హోండా బ్రయో వి ఎమ్‌టి - రూ. 532,000


Click it and Unblock the Notifications









