హోండా సియోల్ కార్స్ ఇండియా పేరు మారిపోయింది

By Ravi

ద్విచక్ర వాహన మార్కెట్లో హీరో హోండా జాయింట్ వెంచర్ నుండి విడిపోయి ఒంటరి ప్రయాణం సాగిస్తున్న జపనీస్ భాగస్వామి హోండా, కార్ మార్కెట్లో కూడా సియోల్ నుంచి విడిపోయి ఒంటరి ప్రయాణాన్ని సాగించాలని నిర్ణయించింది. జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా భారత్‌లోని శ్రీరామ్ గ్రూపుకు చెందిన ఉషా ఇంటర్నేషనల్‌తో చేతులు కలిపి ఇక్కడి మార్కెట్లో 'హోండా సియోలా కార్స్ ఇండియా' (హెచ్ఎస్‌సిఐ) కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

హోండా సియోల్ కార్స్ ఇండియా జాయింట్ వెంచర్‌లోని ఉషా ఇంటర్నేషనల్ వాటాలను కంపెనీ హోండా పూర్తిగా హస్తగతం చేసుకుంది. దీంతో ఇది జపాన్‌కు చెందిన హోండా మోటార్ కార్పోరేషన్ పూర్తి భారతీయ అనుబంధ సంస్థగా అవతరించింది. ఇటీవలే ఈ వాటాల స్వాధీనం పూర్తయిన నేపథ్యంలో కంపెనీ పేరు మార్పు ప్రక్రియను ప్రారంభించింది. కాగా.. నేడు ఈ ప్రక్రియ పూర్తయిందని, తమ సంస్థ పేరును మార్పు చేశామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

దీంతో హోండా సియోల్ కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎస్‌సిఐ) ఇకపై హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐ)గా మారిపోయింది. "ఢిల్లీ మరియు హర్యానాల యొక్క రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, ఎన్‌సిటి ద్వారా జారీ చేయబడిన తాజా సర్టిఫికెట్ ఆఫ్ ఇన్‌కార్పోరేషన్ ప్రకారం సంస్థ పేరు మార్పు తక్షణమే అమల్లోకి వస్తుంద"ని కంపెనీ ప్రకటించింది. హెచ్ఎస్‌సిఐ జాయింట్ వెంచర్‌లో ఉషా ఇంటర్నేషల్‌కు ఉన్న 3.16 శాతం వాటాను గడచిన నెలలో హోండా రూ.180 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఈ జేవిని 1995లో ప్రారంభించబడింది.

More from DriveSpark

Article Published On: Monday, September 10, 2012, 17:59 [IST]
English summary
Japanese auto major Honda has changed the name of its Indian operations to Honda Cars India Ltd following the break up of its joint venture with Usha International of the Shriram Group.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+