జులైలో 7.6 శాతం పెరిగిన హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు
దేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) గడచిన జులై నెలలో నిరుత్సాహకర మార్కెట్ పరిస్థితులు ఉన్నప్పటికీ కంపెనీ ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసుకుంది. జులై 2012లో హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం అమ్మకాలు 6.40 శాతం వృద్ధిని సాధించి 52,845 యూనిట్లుగా నమోదయ్యాయి.
గతేడాది ఇదే కాలానికి కంపెనీ అమ్మకాలు 49,666 యూనిట్లుగా ఉన్నట్లు హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా.. దేశీయ విపణిలో కంపెనీ అమ్మకాలు 7.58 శాతం వృద్ధిని కనబరచి 25,642 యూనిట్ల నుంచి 27,585 యూనిట్లకు పెరగగా, ఎగుమతులు 5.14 శాతం వృద్ధిని నమోదు చేసుకొని 24,024 యూనిట్ల నుంచి 25,260 యూనిట్లకు పెరిగాయి.
సెగ్మంట్ల వారీగా హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు గమనిస్తే.. ఏ2 సెగ్మెంట్లో (ఇయాన్, శాంత్రో, ఐ10, ఐ20) అమ్మకాలు 44,274 యూనిట్లుగా నమోదు కాగా, ఏ3 సెగ్మెంట్లో (యాక్సెంట్, వెర్నా) 8,454 యూనిట్లు, ఏ5 సెగ్మెంట్లో (సొనాటా) 32 యూనిట్లు, ఎస్‌యూవీ సెగ్మెంట్లో (శాంటేఫే) 85 యూనిట్లుగా నమోదయ్యాయి.


Click it and Unblock the Notifications









