ఫిలిప్పీన్స్‌లో 26.3 కి.మీ. మైలేజీనిస్తున్న హ్యుందాయ్ ఇయాన్
వాస్తవానికి హ్యుందాయ్ కంపెనీ తెలిపినదాని ప్రకారం, అలాగే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) సర్టిఫై చేసిన దాని ప్రకారం, భారత రోడ్ కండిషన్‌పై హ్యుందాయ్ ఇయాన్ మైలేజ్ లీటరు పెట్రోల్‌కు 21.1 కి.మీ. మాత్రమే. అయితే ఫిలిప్పీన్స్ రోడ్ కండిషన్స్ ప్రకారం, అక్కడి రోడ్లపై ఈ కారును టెస్ట్ చేసినప్పుడు లీటరుకు 26.3 కి.మీ మైలేజీనిచ్చిందని హ్యుందాయ్ ఏసియా రిసోర్సెస్ పేర్కొంది.
పెట్రోల్ ఇంజన్ కలిగిన కారు లీటరు పెట్రోల్‌కు ఇంత అధికంగా మైలేజీనివ్వటమంటే ఆశ్చర్యకర విషయమే. ఫిలిప్పీన్స్‌లో విడుదల చేయనున్న ఇయాన్ కారులో కూడా 800సీసీ ఇంజన్‌నే ఉపయోగించనున్నారు. ఇది 55 బిహెచ్‌పిల శక్తిని, 75 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. భారత్‌లో తన మార్కెట్ వాటాను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా హ్యుందాయ్ ఈ చవక కారును విడుదల చేసింది.


Click it and Unblock the Notifications









