యాభై వేల మార్కును తాకిన హ్యుందాయ్ ఇయాన్ సేల్స్
భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ప్రస్తుతం ద్వీతీయ స్థానంలో ఉన్న కొరియన్ కారం కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా గడచిన అక్టోబర్ నెలలో దేశీయ విపణిలో విడుదల చేసిన చిన్న కారు ఇయాన్ ఆరంభంలో నత్తనడక సాగించినప్పటికీ, ఆ తర్వాతి కాలంలో టాప్ గేర్‌లో దూసుకుపోవటం ప్రారంభించింది. ప్రస్తుతం హ్యుందాయ్ 50,000 యూనిట్లకు పైగా ఇయాన్ కార్లను విక్రయించి సంబరాలు జరుపుకుంటుంది.
ముఖ్యంగా ఇయాన్‌లో ఎల్‌పిజి వేరియంట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ మోడల్ అమ్మకాలు మరింత జోరందుకున్నాయి. కేవలం రూ.2,69,999 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే హ్యుందాయ్ ఇయాన్ కంపెనీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇంత చౌక ధరలో అద్భుతమైన ఫీచర్లతో లభిస్తున్న ఇయాన్ త్వరలోనే నేపాల్ మార్కెట్లో కూడా అడుగుపెట్టనుంది. ఏడు వేరియంట్లలో హ్యుందాయ్ ఇయాన్ లభ్యమవుతుంది.
హ్యుందాయ్ ఇయాన్ కారులో అమర్చిన 814 సీసీ ఇంజన్ 56 పిఎస్‌ల శక్తిని, 76.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరుకు 21.1 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. మారుతి సుజుకి ఆల్టోకు ఇది గట్టి పోటీనిస్తుంది. చూడటానికి శాంత్రో కన్నా ఇయాన్ కారే బెస్ట్ అనిపిస్తుండటంతో కొనుగోలుదారులు శాంత్రోను వదిలిపెట్టి ఇయాన్ వైపు మొగ్గు చూపుతున్నారు.


Click it and Unblock the Notifications









