మార్చి మొదటి వారంలో మార్కెట్లోకి రానున్న 2012 సొనాటా

కొత్త 2012 హ్యుందాయ్ సొనాటాలో సరికొత్తగా అభివృద్ధి చేసిన 2.4 లీటర్ జిడిఐ (గ్యాసోలైన్ డైరెక్ట్ ఇంజెక్షన్) పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 198 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 250 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. అత్యంత శక్తివంతమైన ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 10-14 కి.మీ. రేంజ్‌లో మైలేజ్ ఇవ్వవచ్చని అంచనా. ఇక దీని ధర విషయానికి వస్తే, ఇది సుమారు రూ.18 లక్షల వరకూ ఉండొచ్చని సమాచారం.
కొత్త 2012 హ్యుందాయ్ సొనాటా సెడాన్‌లో ఫ్రంట్ అండ్ రియర్ వెంటిలేషన్, అధిక కాంతినిచ్చే జెనాన్ హెడ్‌ల్యాంప్స్, క్రూయజ్ కంట్రోల్, పెడల్ షిఫ్ట్, 10-రకాలుగా అడ్జస్ట్ (10-వే అడ్జస్టబుల్ సీట్) చేసుకునే విధంగా అమర్చిన డ్రైవర్ పవర్ సీట్, 4-వే అడ్జస్టబుల్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అంతేకాకుండా.. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), రియర్ వ్యూ కెమెరా, పుష్ బటన్ స్టార్ట్‌తో కూడిన స్మార్ట్ కీ వంటి అత్యాధునిక సాంకేతిక, భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








