ఆగస్ట్ 13న మార్కెట్లోకి రానున్న హ్యుందాయ్ ఫ్లూయిడిక్ ఎలంట్రా

గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆవిష్కరించిన సరికొత్త ప్రీమియం సెడాన్ ఫ్లూయిడిక్ ఎలాంట్రాను దేశీయ విపణిలో వాణిజ్యపరంగా విడుదల చేసేందుకు కంపెనీ ముహుర్తం ఖరారు చేసింది. ఈనెల 13న (ఆగస్ట్ 13, 2012) ఫ్లూయిడిక్ హ్యుందాయ్ ఎలాంట్రా సెడాన్‌ను కంపెనీ దేశీయ విపణిలో విడుదల చేయనుంది. ఈ మోడల్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్‌లను స్వీకరించడం కూడా ప్రారంభించింది.

హ్యుందాయ్ నుంచి అత్యంత పాపులర్ అయిన ఫ్లూయిడిక్ డిజైన్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని సరికొత్త ఎలాంట్రా ప్రీమియం సెడాన్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది. ఇదివరకి ఎలాంట్రా సెడాన్‌తో పోల్చుకుంటే, కొత్త ఫ్లూయిడ్క ఎలాంట్రా డిజైన్ పరంగానూ, టెక్నాలజీ పరంగాను ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండనుంది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభ్యం కానున్న కొత్త హ్యుందాయ్ ఫ్లూయిడిక్ ఎలాంట్రా ధర రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

హ్యుందాయ్ తొలిసారిగా ఎలాంట్రా సెడాన్‌ను 2004లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. అయితే, ఈ మోడల్‌ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగకపోవడంతో కంపెనీ దీని అమ్మకాలను 2007లో నిలిపివేసింది. ప్రస్తుతం ప్రీమియం కార్ మార్కెట్ జోరందుకోవటంతో కొత్త ఎలాంట్రాను వీలైనంత త్వరగా ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

సరికొత్త ఫ్లూయిడిక్ హ్యుంజాయ్ ఎలాంట్రా సెడాన్‌ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ కలిగిన 1.8 డ్యూయెల్ విటివిటి, 1.6 లీటర్ సిఆర్‌డిఐ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇంకా ఇందులో ఫ్రంట్ సీట్లలో ఎయిర్ వెంటిలేషన్, పూర్తి భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, పుష్ బటన్ స్టార్ట్‌తో కూడిన స్మార్ట్ కీ, సోలార్ గ్లాస్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెయిన్ సెన్సార్స్, స్పోర్టీ పెడల్స్, పవర్ సైడ్ మిర్రర్స్, సైడ్ మిర్రర్స్‌పై టర్నింగ్ ఇండికేటర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అంతేకాకుండా.. ఎమ్‌పి3, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 2డిన్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, సురక్షితమైన మరియు సులభమైన పార్కింగ్ కోసం ఎలక్ట్రో క్రోమిక్ మిర్రర్‌ (ఈసిఎమ్)తో కూడిన రియర్ వ్యూ కెమెరా ఆప్షన్‌తో ఇది లభ్యమవుతుంది. ఇది 4530 మి.మీ. పొడవును, 1775 మి.మీ. వెడల్పును, 1435 మి.మీ ఎత్తును మరియు 2,700 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది.

హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ హ్యుందాయ్ ఫ్లూయిడిక్ వెర్నా, లగ్జరీ సెడాన్ హ్యుందాయ్ సొనాటాలకు మధ్యలో ఓ ప్రీమియం సెడాన్‌ను కోరుకునే వారికి హ్యుందాయ్ ఫ్లూయిడిక్ ఎలాంట్రా ఒక మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది. డి-సెగ్మెంట్ సెడాన్ మార్కెట్లోని హోండా సివిక్, చెవర్లే క్రూజ్, టొయోటా కరోలా ఆల్టిస్, ఫోక్స్‌వ్యాగన్ జెట్టా, స్కొడా లారా, రెనో ఫ్లూయెన్స్ వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీగా నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 8, 2012, 14:46 [IST]
English summary
Hyundai Motor India is all set to launch its all new premium sedan Elantra on August 13, 2012. New Hyundai Elantra sedan is designed on the principles of Fluidic Sculpture, now its more stylish and more sporty.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+