ఫ్లూయిడిక్ సొనాటాను విడుదల చేసిన హ్యుందాయ్

భారతదేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 11వ అంతర్జాతీయ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన సరికొత్త అప్‌గ్రేడెడ్ సొనాటా ఫ్లూయిడిక్ సెడాన్‌ను కంపెనీ దేశీయ విపణిలో అందుబాటులోకి తీసుకు వచ్చింది. హ్యుందాయ్ నుండి అత్యంత విజయం సాధించిన ఫ్లూయిడిక్ డిజైన్ థీమ్ కాన్సెప్ట్ ఆధారంగానే కొత్త సొనాటాను రూపొందించడం జరిగింది.

ఆరవ తరానికి చెందిన ఫ్లూయిడిక్ స్టయిల్ సొనాటా సెడాన్‌లో సరికొత్త 2.4 లీటర్ జిడిఐ (గ్యాసోలైన్ డైరెక్ట్ ఇంజెక్షన్) పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 198 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 250 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. అత్యంత శక్తివంతమైన ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌‌తో లభిస్తుంది.

మ్యాన్యువల్ వెర్షన్ ఫ్లూయిడిక్ సొనాటా ధరను రూ.18,52,979 గానూ, ఆటోమేటిక్ వెర్షన్ ఫ్లూయిడిక్ సొనాటా ధరను రూ.20,61,272 గానూ నిర్ణయించామని కంపెనీ పేర్కొంది.

కొత్త 2012 హ్యుందాయ్ సొనాటా సెడాన్‌లో ఫ్రంట్ అండ్ రియర్ వెంటిలేషన్, అధిక కాంతినిచ్చే జెనాన్ హెడ్‌ల్యాంప్స్, క్రూయజ్ కంట్రోల్, పెడల్ షిఫ్ట్, 10-రకాలుగా అడ్జస్ట్ (10-వే అడ్జస్టబుల్ సీట్) చేసుకునే విధంగా అమర్చిన డ్రైవర్ పవర్ సీట్, 4-వే అడ్జస్టబుల్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. కొత్త సొనాటా ఫ్లూయిడిక్ డిజైన్ కాన్సెప్ట్‌ను పాటిస్తూ మమచి స్పోర్టీ లుక్‌ని ఇస్తుంది.

హ్యుందాయ్ తాజాగా విడుదల చేసిన ఎకో-ఫ్రెండ్లీ సొనాటాలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టిసిఎస్)తో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), రియర్ వ్యూ కెమెరా, పుష్ బటన్ స్టార్ట్‌తో కూడిన స్మార్ట్ కీ వంటి అత్యాధునిక సాంకేతిక మరియు భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, March 22, 2012, 15:52 [IST]
English summary
The New Fluidic Sonata is Hyundai's latest Premium sedan. The car was unveiled at the 12th Delhi auto Expo. The Korean carmaker has now launched the Fluidic Sonata with a price tag of Rs.18.52 lakhs. The Sonata competes against premium sedans such as the Toyota Camry and the Honda Accord.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+