కొత్త ఐ20 ఫ్లూయిడిక్‌ను విడుదల చేసిన హ్యుందాయ్
పెట్రోల్ వేరియంట్ ఐ20 ధరలు రూ.4,73,400 నుండి రూ.6,65,894 రేంజ్‌లో ఉండగా, డీజిల్ వేరియంట్ ఐ20 ధరలు రూ.5,96,334 నుండి రూ.7,44,013 మధ్యలో ఉన్నాయి. ఇకపోతే ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.7,67,405 లుగా ఉంది.
ఈ సరికొత్త ఐ-జెన్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ డ్యూయెల్ విటివిటి (వేరియబుల్ వాల్వ్ టైమింగ్) టెక్నాలజీతో కూడిన రీఫైన్ చేయబడిన శక్తివంతమైన 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది గరిష్టంగా 84 పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తుంది.
అంతేకాకుండా ఇది ఆధునిక, హై-టెక్ 1.4 యూ2 సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్‌తో 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో కూడా లభిస్తుంది. ఇది గరిష్టంగా 90 బిహెచ్‌పిల శక్తిని, 22.4 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.
ఇకపోతే ఆటోమేటిక్ వేరియంట్లో 1.4 లీటర్ గమ్మా పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 100 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 13.9 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. కొత్త ఐ20లో సరికొత్త ఫీచర్లను హ్యుందాయ్ ఆఫర్ చేస్తుంది.


Click it and Unblock the Notifications









