కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్లను అందిస్తున్న హ్యుందాయ్
మాన్‌సూన్ సీజన్ స్టార్ట్ అయింది. ఇంకేముంది కార్ కంపెనీలు వరుసగా తమ కార్ల వివిధ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అసలే అమ్మకాలు అంతంత మాత్రంగా సాగుతుండటంతో వాటికి కాస్త జోరును అందించే క్రమంలో భాగంగా దేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ కార్లపై స్మార్ట్ స్కీమ్‌లను అందిస్తోంది.
'ఇదివరెన్నడూ లేని, ఇకపై ఎన్నడూ రాని ఆఫర్' (నెవర్ బిఫోర్, నెవర్ ఎగైన్ ఆఫర్) అంటూ హ్యుందాయ్ ఓ కొత్త ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్‌లో భాగంగా హ్యుందాయ్ కార్లపై రూ.20,000 మొదలుకొని రూ.40,000 వరకూ సేవింగ్స్‌ను కంపెనీ అందిస్తోంది. ఈ ఆఫర్ అన్ని చిన్నకార్ల (ఐ10, శాంత్రో జింగ్, ఇయాన్)పై వర్తిస్తుంది.
శాంత్రో, ఐ10 కార్లు హ్యుందాయ్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కారు. ప్రస్తుతం నెక్స్ట్-జెన్ హ్యుందాయ్ ఐ10 కేవలం రూ.3.54 లక్షల ప్రారంభ ధరకే లభిస్తోంది (ఎక్సేంజ్ ఆఫర్స్‌తో కలిపి). కస్టమర్లు హ్యుందాయ్ ఐ20పై కూడా రూ. 32,000 వరకూ సేవింగ్స్‌ను పొందవచ్చు. అసెంట్, వెర్నా సెడాన్‌లపై రూ.20,000 నుంచి రూ.30,000 వరకూ తగ్గింపులను, శాంటాఫే ఎస్‌యూవీపై రూ.30,000 వరకూ సేవింగ్‌లను ఈ స్కీమ్‌లో పొందవచ్చు.
ఈ ఆకర్షనీయమైన ఆఫర్లు, తగ్గింపులు జులై 25, 2012 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. మరింకెందుకు ఆలస్యం వెంటనే మీ సమీపంలోని హ్యుందాయ్ షోరూమ్‌కి వెళ్లి నెవర్ బిఫోర్, నెవర్ ఎగైన్ ఆఫర్లను సద్వినియోదం చేసుకోండి.


Click it and Unblock the Notifications









