వాహనాల ధరలను రూ.5,000 మేర పెంచిన హ్యుందాయ్

By Ravi

Hyundai Price Hike
వచ్చే నుంచి హ్యుందాయ్ కార్లు మరింత ప్రియం కానున్నాయి. ఉత్పాదక వ్యయం పెరుగుతున్న కారణంగా ఉత్పత్తులను ధరలను పెంచుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే మారుతి సుజుకి, రెనో, ఆడి, జనరల్ మోటార్స్, హోండా కార్స్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా దేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా తమ ఉత్పత్తుల ధరలను రూ.5,000 మేర పెంచనున్నట్లు ప్రకటించింది.

పెరిగిన ధరలు నవంబర్ 1, 2012వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. పెరిగిన ఇన్‌పుట్ ధరల వలన ఉత్పత్తుల ధరలు పెంచక తప్పడం లేదని, తమ వినియోగదారులకు అసౌకర్యం కలిగించకుండా ఉండేలా ధరల పెంపును కనిష్టం చేసేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (నేషనల్ సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ వ్యాఖ్యానించారు. హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ ఇయాన్ మొదలు కొని ప్రీమియం ఎస్‌యూవీ శాంటాఫే వరకూ అన్ని ఉత్పత్తుల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది.

అయితే, ఏయే మోడల్‌పై ఎంత మేర ధరలు పెంచుతున్నామనే విషయాన్ని మాత్రం కంపెనీ వివరించలేదు. ప్రస్తుతం హ్యుందాయ్ దేశీయ విపణిలో అందిస్తున్న కార్ల ధరలు రూ. 2.75 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి రూ.25.38 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) శ్రేణిలో ఉన్నాయి.

కాగా.. మారుతి సుజుకి ఇటీవలే తమ కార్ల ధరలను మోడల్‌ను బట్టి రూ.2,500 నుంచి రూ.5,250 మేర ధరలను పెంచగా, జనరల్‌ మోటార్స్‌ కూడా రూ.8,000 నుంచి రూ.20,000 మేర ధరలను పెంచిన సంగతి తెలిసిందే. హోండా అందిస్తున్న బ్రయో, జాజ్, సిటీ సెడాన్ ధరలను 2.6 శాతం మేర పెంచింది. అలాగే, రెనో ఇండియా ఇటీవలే ఇండియాలో విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ డస్టర్‌ ధరను రూ.40,000 వరకూ పెంచగా, జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా విడుదల చేసిన ఆడి క్యూ3 లగ్జరీ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరను సుమారు రూ.50,000 మేర పెంచింది.

More from DriveSpark

Article Published On: Monday, October 29, 2012, 18:25 [IST]
English summary
India's second largest car manufacturer, Hyundai Motor India Ltd. (HMIL), today announced the price increase in all its models starting from Eon to Santa Fe. The price increase would be up to Rs.5,000 across models and would come into effect from Nov 01,2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+