కొత్త 2012 హ్యుందాయ్ శాంటాఫేలో కూడా ఫ్లూయిడిక్ డిజైన్

ఆ తర్వాత కంపెనీ నుండి విడుదలై చిన్న కారు ఇయాన్‌లో కూడా ఇదే ఫ్లూయిడిక్ డిజైన్ థీమ్‌ను ఉపయోగించడం జరిగింది. అంతేకాకుండా.. హ్యుందాయ్ ఇటీవల ముగిసిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన ప్రీమియం సెడాన్ ఎలాంట్రా, కాన్సెప్ట్ ఎమ్‌పివి హెక్సా స్పేస్ (కోడ్ నేమ్: హెచ్ఎన్‌డి-7) మోడళ్లలో కూడా ఫ్లూయిడిక్ డిజైన్ కాన్సెప్ట్‌ను ఉపయోగించింది.
ఇప్పుడు తాజాగా.. హ్యుందాయ్ నుండి మార్కెట్లోకి రానున్న సరికొత్త అప్‌గ్రేడెడ్ శాంటాఫే ఎస్‌యూవీలో కూడా ఫ్లూయిడిక్ డిజైన్ కాన్సెప్ట్‌ను ఉపయోగించడం జరిగింది. త్వరలో జరగనున్న న్యూయార్క్ మోటార్ షోలో హ్యుందాయ్ ఈ ఎస్‌యూవీని విడుదల చేయనుంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ల పరంగా ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న శాంటేఫే ఎస్‌యూవీకి సరికొత్త 2012 శాంటాఫే ఎస్‌యూవీకి అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications








