ఐసిసి వరల్డ్ ట్వెంటీ20 2012 'ఫస్ట్ బాల్'ను ప్రదర్శించిన హ్యుందాయ్

By Ravi

ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీజన్ ఐసిసి వరల్డ్ ట్వెంటీ20 2012. సెప్టెంబర్ 18 నుండి ఈ క్రికెట్ మహా సంగ్రామం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, 4వ ఐసిసి వరల్డ్ ట్వెంటీ20 2012 తొలి మ్యాచ్‌లో ఉపయోగించనున్న మొదటి బంతిని (ఫస్ట్ బాల్)ను దేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) ప్రదర్శనకు ఉంచింది.

న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమలో కంపెనీ జనరల్ మేనేజర్ గ్రూప్ హెడ్ (మార్కెటింగ్) నలిన్ కపూర్ ఈ ఐసిసి వరల్డ్ ట్వెంటీ20 2012 ఫస్ట్ బాల్‌ను ప్రదర్శించారు. హ్యుందాయ్ ఇయాన్ కారులో ఈ ఫస్ట్ బాల్ సెట్‌ను మీడియాకు ప్రదర్శించారు. సెప్టెంబర్ 18, 2012న శ్రీలంకలో జరగనున్న తొలి మ్యాచ్‌లో ఈ బంతులను ఉపయోగిస్తారు. మొదటి ట్వెంటీ20 మ్యాచ్ శ్రీలంక, జింబాబ్వే జట్ల మధ్య జరగనుంది.


హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐసిసితో అధికారిక కార్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 2015 వరకూ ఐసిసితో హ్యుందాయ్ ఈ భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుంది. హ్యుందాయ్ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవటానికి ఐసిసి వలర్డ్ ట్వెంటీ20 ఒక గొప్పగా ఫ్లాట్‌ఫామ్‌గా సహకరించనుంది. న్యూఢిల్లీ, ముంబాయి, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ మరియు లక్నో నగరాల్లో ఈ ఫస్ట్ బాల్‌ను ప్రదర్శిస్తారు.

ఈ క్రికెట్ బాల్స్‌ను ప్రదర్శించడం కోసం ఓ హ్యుందాయ్ ఇయాన్ కారును ప్రత్యేకంగా బ్రాండింగ్ చేశారు. ఐసిసి వలర్డ్ ట్వెంటీ20 2012 ప్రమోషన్ కార్యకలాపాల్లో భాగంగా, హ్యుందాయ్ గడచిన జులై 2012 నెలలో న్యూఢిల్లీ, ముంబాయి, చెన్నై నగరాల్లో 'ట్రోఫీ టూర్'ను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Sunday, September 16, 2012, 10:58 [IST]
English summary
India's second largest car manufacturer Hyundai Motor India Limited (HMIL), has showcased the ‘First Ball’ for ICC World Twenty20, 2012. Hyundai holds the exclusive rights to showcase the set of Cricket Balls which will be used in the first match of the ICC World Twenty20 on September 18, 2012 in Sri Lanka.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+