ఐ20 బుకింగ్స్ నిలిపివేత, కొత్త మోడల్ లాంచ్ కోసమే..!!

హ్యుందాయ్ పాపులర్ డిజైన్ కాన్సెప్ట్ "ఫ్లూయిడిక్" స్టైల్‌తో రూపొందించిన ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ త్వరలోనే దేశీయ విపణిలో విడుదల చేయనుంది. ఇందులో భాగంగా స్టాక్ క్లియర్ చేసుకునేందుకు గానూ హ్యుందాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డీలర్ల వద్ద ఉన్న పాత ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ల ఇన్వెంటరీ క్లియర్ అయిన తర్వాత కొత్త మోడల్‌ను కంపెనీ విడుదల చేయనుంది.
హ్యుందాయ్ వెర్నా ద్వారా ఇండియాకు పరిచయం చేసిన ఫ్లూయిడిక్ డిజైన్ థీమ్‌కు మార్కెట్ నుండి సానుకల స్పందన రావడం, దీనిని వినియోగదారులు ఆదరిస్తుండటంతో అన్ని మోడళ్లలోనూ ఈ డిజైన్ థీమ్‌ను పరిచయం చేసేందుకు కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే, వెర్నా, ఇయాన్, సొనాటాలో ఈ డిజైన్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టగా, శాంటాఫే ఎస్‌యూవీలో కూడా దీన్ని పరిచయం చేయాలని హోండా యోచిస్తోంది.
ఫ్లూయిడిక్ స్టైల్ ఐ20 కూడా మార్చి నెలలో మార్కెట్లోకి రానుంది. ఇదే నెల మొదటి వారంలో ఫ్లూయిడిక్ స్టైల్ సొనాటా సెడాన్ కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే. మార్కెట్ సమాచారం ప్రకారం, కొత్త ఐ20 మోడల్‌ను ఇప్పటికే చెన్నైలోని ప్లాంటులో కంపెనీ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత డెలివరీలు జాప్యం జరగకుండా ఉండేందుకు తగినత ఉత్పత్తి కంపెనీ సిద్ధం చేసుకుంటున్నట్లుంది.


Click it and Unblock the Notifications








