ఆర్‌బిఐ నిర్ణయంతో వడ్డీ రేట్లను తగ్గిస్తున్న బ్యాంకులు
ఇప్పటికే ఐడిబిఐ బ్యాంక్ వడ్డీరేట్లను పావు శాతం తగ్గించగా, తాజాగా దేశీయ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు ఐసిఐసిఐ, ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పిఎన్‌బి)లు కూడా కేవలం పావు శాతం మాత్రమే వడ్డీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దేశంలోని రెండు అత్యంత ప్రధాన బ్యాంకులైన ఇవి వడ్డీరేట్లను కేవలం పావు శాతం మాత్రమే తగ్గించడంతో ఇతర బ్యాంకులు కూడా వీటినే అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డిపాజిట్లు, రుణాలపై ఐసిఐసిఐ వడ్డీరేట్లను 0.25 శాతం తగ్గించింది. ఈ తగ్గింపు ఏప్రిల్ 23 నుంచి అమలులోకి వస్తుందని బ్యాంక్ పేర్కొంది. ఇకపోతే ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేటును 0.25 శాతం నుండి 0.50 శాతం వరకూ, రుణాలపై వడ్డీ రేటును 0.25 శాతం మేర తగ్గిస్తున్నామని పేర్కొంది. హెడ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ వంటి ఇతర బ్యాంక్‌లు వడ్డీ రేట్లపై తమ నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications









