ఎలక్ట్రిక్ రేస్ కారును తయారు చేసిన ఐఐటి-బాంబే విద్యార్థులు

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులు అవుతారు.. అన్నట్లుగా.. సాధించాలని మనస్సు కలిగితే అసాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని మరోసారి విద్యార్థులు నిరూపించారు. ఐఐటి-బాంబేకు చెందిన విద్యార్థులు గంటకు గరిష్టంగా 115 కి.మీ. వేగంతో పరుగులు తీసే ఓ ఎలక్ట్రిక్ రేస్ కారును తయారు చేసి శభాష్ అనిపించుకున్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎనర్జీ సైన్స్‌లకు సంబంధించిన సుమారు 60 మంది విద్యార్థులు కలసికట్టుగా ఈ ఎలక్ట్రిక్ రేస్ కారును డెవలప్ చేశారు.

'ఈవి01'గా పిలిచే ఎలక్ట్రిక్ కారు కేవలం ఐదు సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కి.మీ. ఈ కారు మొత్తం బరువు 280 కిలోలు (డ్రైవర్ లేకుండా). గరిష్ట శక్తి 32 కిలోవాట్లు. సింగిల్ ఛార్జ్‌పై ప్రయాణించే దూరం 35 కి.మీ. బ్యాటరీ ఛార్జిం సమయం 3 గంటలు.

ఈవి01 ఎలక్ట్రిక్ రేస్ కారును డిజైన్ చేసిన ఈ బృందం ఇప్పుడు ఇందులో మరిన్ని ఫీచర్లతో కూడిన ఈవి02 2013 వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. గ్రిప్ అండ్ పెర్ఫామెన్స్ విషయంలో ఈవి02 ఎలక్ట్రిక్ రేస్ కార్ ఈవి01 కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు.

"ఈవి01లో రెండు మోటార్లు ఒకదానితో ఒకటి యాంత్రికంగా జతచేయబడి పనిచేస్తాయి. ఇందులో ఉపయోగించిన టెక్నాలజీ మెకానికల్ డిఫరెన్షియల్. అయితే మేము తయారు చేయనున్న తర్వాతి వెర్షన్ రెండు వ్యక్తిగత మోటార్లను అమర్చాలని ప్రయత్నిస్తున్నాం. అక్కడ ఉపయోగించే టెక్నాలజీ ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్. ఇది మరింత గ్రిప్‌ను ఇవ్వటమే కాకుండా, పెంచబడిన పెర్ఫామెన్స్ ద్వారా రేస్ సమయంలో ప్రతి ల్యాప్‌ను కవర్ చేయటానికి ఎక్కువ సమయం తీసుకోద"ని ఈవి01 ప్రాజెక్ట్ మేనేజర్లలో ఒకరైన ప్రతీక్ శర్మ తెలిపారు.

ఈ కారులో అమర్చిన లిథియం పాలిమర్ బ్యాటరీల సాయంతో ఇది పనిచేస్తుంది. ఇది పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్న సిల్వర్‌స్టోన్ ఫార్ములా-1 రేస్ ట్రాక్‌పై తలపడనున్న 109 కార్లతో ఇది పోటీ పడనుంది. 2009లో ఈ బృందం ఓ చిప్-పవర్డ్ ఫార్ములా కారును అభివృద్ధి చేసింది. ఈ కారును తయారు చేయటానికి సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేశామని, ఒకవేళ ఇదే కారును సాధారణం రేస్ కార్ ఇంజన్‌తో తయారు చేసి ఉంటే కేవలం రూ.12 లక్షలు మాత్రమే ఖర్చు అయి ఉండేదని శర్మ వివరించారు.

More from DriveSpark

Article Published On: Friday, June 15, 2012, 15:23 [IST]
English summary
A team of Students of from IIT-Bombay has developed an electric racing car, dubbed as 'EVo1', which can speeds up to 115 kmph. This team spent nearly Rs 15 lakhs to develop this car. The EV01 is powered lithium polymer batteries.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+