రూ.70 లక్షల వరకూ పెరగనున్న ఇంపోర్టెడ్ కార్ల ధరలు

సాధారణంగా ఇంపోర్టెడ్ కార్లంటే కాస్తంత అధిక ఖర్చుతో కూడుకున్నవి. ఇవి పూర్తిగా విదేశాల్లో తయారై ఓడలు, విమానాల ద్వారా మన దేశంలోకి దిగుమతి చేసుకుని విక్రయించడం జరుగుతుంది. వీటిపై అధిక దిగుమతి సుంఖం ఉంటుంది కాబట్టి వీటి ధరలు కూడా అధికంగానే ఉంటాయి.

అయితే, తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2012-13లో దిగుమతి చేసుకున్న కార్లపై దిగుమతి సుంఖాన్ని (కస్టమ్స్ డ్యూటీ) 60 శాతం నుండి ఏకంగా 75 శాతానికి పెంచడంతో వీటి ధరలు మరింత పెరగనున్నాయి. ఫెరారీ, పోర్షే, లాంబోర్గినీ, రోల్స్ రాయిస్, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్ వంటి పలు లగ్జరీ కార్ కంపెనీలు దేశీయ మార్కెట్లో అందిస్తున్న సూపర్ కార్ల ధరలు అమాంతం రూ.20 లక్షల నుండి రూ.70 లక్షల వరకూ పెరగనున్నాయి.

ఇంపోర్టెడ్ కార్ల ధరలు 20 శాతం నుండి 25 శాతం మేర పెరగనున్న నేపథ్యంలో ఈ సెగ్మెంట్లో కార్ల అమ్మకాలు భారీగా క్షీణించే ఆస్కారం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గడచిన సంవత్సరంలో సుమారు 500 కార్లను ఇండియాలోకి దిగుమతి చేసుకోవటం జరిగింది. ఈ తాజా పెంపుతో ఈ సంవత్సరం సూపర్ కార్ల అమ్మకాలు మందగించే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 29, 2012, 11:56 [IST]
English summary
The union budget for 2012-13 has imposed higher excise taxes on cars manufactured in India and higher customs duty on imported cars. We have so far reported the increased prices of locally built cars. Here is a comprehensive details of how much imported car prices will increase.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+