జాక్‌పాట్ కొట్టిన ఇమ్రాన్, వెయిటింగ్ పీరియడ్ కన్నా ముందే డెలివరీ
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ఫెరారీ కంపెనీ షెడ్యుల్ చేసిన టైమ్ కన్నా ముందుగానే కారును డెలివరీ చేసింది. తమ కస్టమర్ ఇమ్రాన్ ఖాన్ కావడంతో, ఫెరారీ కాలిఫోర్నియా కారును దిగుమతి చేసుకొని వెయిటింగ్ పీరియడ కన్నా ముందుగానే డెలివరీ చేసింది. ఫెరారీ కాలిఫోర్నియా కారు 4.3లీటర్ వీ8 ఇంజన్‌ను కలిగి ఉండి 453 బిహెచ్‌పిల శక్తిని, 485 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.
ఫెరారీ కారును సొంతం చేసుకోవాలనేది తన చిన్ననాటి కల అని, అది నేటికి నెరవేరిందని ఇమ్రాన్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇమ్రాన్ ఖాన్ తన కొత్త ఫెరారీ కారులో కరీనా కపూర్‌ని పక్కన కూర్చోబెట్టుకొని నగర రోడ్లపై షికార్లు చేశాడు. తమ కొత్త చిత్రం "ఏక్ మై ఔర్ ఏక్ తూ" ప్రమోషన్ కోసం వీరిరువురు ఫెరారీ కాలిఫోర్నియా కారులో విచ్చేశారు.
వాస్తవానికి ఈ కారు డెలివరీ కోసం తాను మరో ఏడాది పాటు వేచి ఉండాల్సి ఉండేదని, అయితే ఫెరారీ కంపెనీ చెప్పిన దాని కన్నా ముందుగానే కారును డెలివరీ చేసిందని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.


Click it and Unblock the Notifications









