వాణిజ్య వాహనాల అమ్మకాల్లో అగ్ర స్థానంలో ఇండియా
గడచిన సంవత్సరంలో కూడా ఇండియా వరుసగా రెండోసారి అన్ని దేశాలను ఓవర్‌టేక్ చేసింది. ఎందులో అనుకుంటున్నారా..? వాణిజ్య వాహనాల అమ్మకాల్లో లెండి. 2011లో ప్రపంచ వ్యాప్తంగా చూస్తే వాణిజ్య వాహనా విక్రయాల్లో భారత్‌దే అగ్రస్థానం.
ఈ సెగ్మెంట్లో అత్యధిక అమ్మకాలతో చైనాతో కలిపి ఇతర దేశాలను అధిగమించి వరుసగా రెండోసారి కూడా ఇండియానే ప్రపంచపు వేగంగా వృద్ధి చెందుతున్న ట్రక్ అండ్ బస్ మార్కెట్‌గా నిలిచింది.
గడచిన సంవత్సరంలో భారత వాణిజ్య వాహనాల అమ్మకాలు, ముఖ్యంగా ట్రక్కులు, బస్సులు, చిన్న తరహా వాణిజ్య వాహనాల విక్రయాలు 22 శాతం వృద్ధిని సాధించాయి. ఇదే సమయంలో చైనా దేశపు వాణిజ్య వాహన అమ్మకాలు 10 శాతం క్షీణించాయి.
ఒకప్పుడు ప్రపంచపు అతిపెద్ద వాణిజ్య వాహన మార్కెట్ అయిన అమెరికా అమ్మకాలు 2011లో తిరిగి ట్రాక్ మీదకు వచ్చాయి. ఈ సమయంలో అమెరికా 13 శాతం వృద్ధిని తన ఖాతాలో వేసుకుంది. మొత్తమ్మీద 2011లో దేశీయ మార్కెట్లో వాణిజ్య వాహన అమ్మకాలు జోరుగా సాగాయి.


Click it and Unblock the Notifications









