ఇండియా నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌కు బస్ రూట్

మీరు ఇండియా నుంచి యూకే (యునైటెడ్ కింగ్‌డమ్) వరకూ బస్ రూట్ ఉంటే ఎలా ఉంటుంది..? ఏంటి పగటి కలలు కంటున్నారా..? అని అనుకోకండి. ప్రముఖ ఆంగ్ల పత్రిక డైలీ మిర్రర్ ప్రచురించిన కథనం ప్రకారం, బ్రిటన్‌కు చెందిన ఓ బస్ ఏజెన్సీ యూకేలోని బిర్మింగ్‌హామ్ నుంచి కాశ్మీర్‌లో ఉన్న మిర్పూర్ వరకూ బస్ సర్వీస్‌ను ఆఫర్ చేయాలని యోచిస్తోంది.

సుమారు 4,000 మైళ్ల దూరం ఉండే ఈ రూట్ ద్వారా బస్సులో ప్రయాణించడానికి మొత్తం 12 రోజుల సమయం పడుతుంది. ఈ బస్ రూట్ మొత్తం ఏడు దేశాలను (రష్యా, ఇరాన్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్‌లు కలుపుకొని) తాకుతూ వెళ్తుంది. బిర్మింగ్‌హామ్‌లో కాశ్మీరీయులు ఎక్కువగా నివసిస్తుంటారు. ఈ నేపథ్యంలో కాశ్మీర్‌ను, యూకే రోడ్డు మార్గం ద్వారా కలపాలనే ఆలోచనతో ఈ బస్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

ఈ 12 రోజుల ప్రయాణానికి గానూ ఛార్జ్ చేసే బస్ టికెట్ ధర 130 బ్రిటీష్ పౌండ్లు. అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ.11,000 లకు పైమాటే. ఏదేమైనప్పటికీ, ఈ బస్ రూట్ తాలిబన్ తీవ్రవాదులు దాక్కుని ఉండే క్వెట్టా, ఆఫ్ఘనిస్థాన్ బార్డర్ల ప్రయాణించాల్సి ఉన్న నేపథ్యంలో భద్రతాపరమైన సమస్యలు రావచ్చని భావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే.. జీవితం మీద ఆశలు వదలుకొని అడ్వెంచర్ ప్రయాణం చేయాలనుకు వాళ్లు మాత్రమే బ్రిటన్‌ను బస్సులు వెళ్తారేమో..! మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Monday, October 1, 2012, 17:36 [IST]
English summary
Mirpur in Jammu and Kashmir will now be directly linked by road with the United Kingdom through a direct bus service, says a report. A new 4,000-mile bus route connecting the city Birmingham, will pass through seven countries, including Iran, before finally reaching its destination, also known as 'Little Birmingham', the Daily Mirror reports.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+