ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నుంచి 'ఆటో లైఫ్‌' స్కీమ్

Autolife
వాహన బీమా కొనుగోలును మరింత సులభం చేసేందుకు "ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌" ఓ సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో తక్షణం అదే చోటనే జీవిత బీమా కవరేజీ ప్రయోజనాలను పొందే విధంగా ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ "ఆటో లైఫ్" పేరుతో ఓ పథకాన్ని రూపొందించింది.

అందుబాటు రేట్లలో బీమా సౌకర్యాన్ని కల్పించడం కోసం, తక్కువ డాక్యుమెంటేషన్‌, సరళమైన విధానంతో కూడిన ఈ 'ఆటో లైఫ్‌" స్కీమ్ ఇటు వినియోగదారునికి, డీలర్‌కు, అటు బీమా సంస్థకు లాభదాయ కంగా ఉండేలా రూపొందించారు. ఆటోలైఫ్‌ కింద కస్టమర్లకు విలువతో కూడిన సేవలు అందిస్తామని, 48 గంటల్లోగా క్లెయిమ్‌లను పరిష్కరిస్తామని ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి నందగోపాల్‌ తెలిపారు.

దేశపు అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకులైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఆంధ్రా బ్యాంక్‌లతో పాటుగా బ్రిటన్‌కు చెందిన అగ్రగామి రిస్క్‌, వెల్త్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ అయిన లీగల్‌ అండ్ జనరల్‌ల జాయింట్‌ వెంచర్‌ నుండి పుట్టుకొచ్చిందే ఈ ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ. ఈ కంపెనీలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు 44 శాతం, ఆంధ్రా బ్యాంక్‌‌కు కు 30 శాతం, లీగల్‌ అండ్‌ జనరల్‌కు 26 శాతం వాటాలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, January 30, 2012, 10:53 [IST]
English summary
IndiaFirst Life Insurance has launched 'Autolife' a simple process of getting life insurance cover instantly at an affordable cost.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+