వాహన కొనుగోలు విషయంలో మారుతున్న ఇండియన్ల్ టేస్ట్
ఇలా కేవలం కార్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ మాత్రమే కాకుండా ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, ఫీచర్లు, ఇంజన్, టెక్నాలజీ వంటి అన్ని విభాగాల్లో ప్రపంచ స్థాయి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే.. వాహనాల కొనుగోలు విషయంలో మారుతున్న కాలంతో పాటుగానే భారతీయ కొనుగోలుదారుల ఇష్టాయిష్టాలు కూడా మారిపోతున్నాయి. మన వాళ్లు కూడా గ్లోబల్ మోడళ్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటంతో ఫారిన్ కార్ కంపెనీలకు పెద్ద పని తప్పినట్లు అవుతుంది.
వాస్తవానికి విదేశీ కంపెనీలు ఏదైనా ఒక మోడల్‌ను ఉత్పత్తి చేసి దానిని వివిధ దేశాల్లో విడుదల చేయాలనుకున్నప్పుడు, సదరు దేశాల వినియోగదారుల అభిరుచులకు, అవసరాలకు సరిపోయే విధంగా భారీ మార్పులు చేయాల్సి ఉంటుంది. దీనికి కంపెనీలు కూడా పెద్ద మొత్తంలోనే పెట్టుబడులను వెచ్చించాల్సి ఉంటుంది. అయితే, అదే కంపెనీ ఏదైనా గ్లోబల్ మోడల్‌ను అభివృద్ధి చేసినట్లయితే, సదరు గ్లోబల్ మోడల్‌ను ప్రపంచ మార్కెట్లలో విడుదల చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు.


Click it and Unblock the Notifications









