రూ.2,000ల నుంచి ఇండియన్ ఫార్ములా వన్ టికెట్స్

By Ravi

Fromula One
గడచిన సంవత్సరం అక్టోబర్ నెలలో భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా జరిగిన ఎఫ్1 (ఫార్ములా వన్) రేస్ ఎయిర్‌టెల్ గ్రాండ్ ప్రి ఆఫ్ ఇండియాలో ఫార్ములా వన్ కార్లతో మోతతో హోరెత్తిన బుధ్ ఇంటర్నెషనల్ సర్క్యూట్ (బిఐసి) మరోసారి రయ్ రయ్ మనే రేస్ సౌండ్స్ కోసం ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో బిఐసిలో తాజాగా జరగనున్న ఫార్ములా వన్ రేస్ కోసం ఇండియన్ గ్రాండ్ ప్రి ఆర్గనైజర్లు టికెట్లను విక్రయించడం ప్రారంభించారు.

'ఇండియన్ ఫార్ములా గ్రాండ్ ప్రి'గా పిలిచే ఈ ఎఫ్1 రేస్ అక్టోబర్ 26 నుంచి 28 వరకూ జరగనుంది. వీక్షకులు కావాలనుకుంటే, మూడు రోజుల ఈవెంట్‌కు లేదా కేవలం రేస్ రోజుకు మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. వీటి ధరలు రూ.2,000ల నుంచి రూ.21,000 మధ్యలో ఉన్నాయి. సీజన్ టికెట్ (3-రోజులు) గ్రాండ్‌స్టాండ్ (రేస్ ట్రాక్‌కు అతి సమీపంలో) ధర రూ. 21,000లుగా ఉండగా, రేస్ రోజు గ్రాండ్‌స్టాండ్ టికెట్ ధర రూ. 12,000లుగా ఉంది.

తక్కువ ధరలో కూడా గ్రాండ్ ప్రిను లైవ్‌లో వీక్షించాలనుకునే వారి కోసం న్యాచురల్ స్టాండ్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి 1-2, 8-9 మలుపుల వద్ద ఉంటాయి. మూడు రోజులకు గాను న్యాచురల్ స్టాండ్ టికెట్ రూ.3,000లుగా ఉండగా, రేస్ రోజు టికెట్ ధర రూ.2,000లుగా ఉన్నాయి. ఈ ఫార్ములా వన్ రేస్ కోసం అందుబాటులో ఉన్న వివిధ స్టాండ్‌లు, వాటి టికెట్ల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

WEST ZONE (Friday-Sunday)
Main Grandstand - Rs. 23,100
Classic Stand 1 West - Rs. 6,600
Classic Stand 2 West - Rs. 6,600

NORTH ZONE (Friday-Sunday)
Classic Stand North - Rs. 6,600
Picnic Stand North - Rs. 3,300

EAST ZONE (Friday-Sunday)
Star Stand 1 East - Rs. 8,250
Star Stand 2 East - Rs. 8,250
Star Stand 3 East - Rs. 8,250
Classic Stand East - Rs. 6,600

SOUTH ZONE (Friday-Sunday)
Premium Stand South - Rs. 11,000
Picnic Stand South - Rs. 3,300
Natural Stand South - Rs. 3,300

ఇండియన్ ఫార్ములా గ్రాండ్ ప్రి కోసం టికెట్లను బుక్ చేసుకోవటానికి http://www.indian-grand-prix.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.

More from DriveSpark

Article Published On: Monday, October 8, 2012, 14:55 [IST]
English summary
Did you get to catch the action last year, when Formula 1 roared the tracks of the Buddh International Circuit. No matter if you didn't that's history now. The Indian GP organizers have opened the ticket sales for the upcoming Indian Formula Grand prix, which is scheduled on October 26 - 28.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+