నష్టపరిహారం చెల్లించకుంటే పెట్రోల్ ధరలు పెంచుతాం: ఐఓసి
దీంతో చమురు కంపెనీలపై పెట్రో భారం తడిసి మోపెడయ్యింది. నిజానికి చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ప్రకారం ఇక్కడి మార్కెట్లో ధరలను పెంచడమో తగ్గించడమో చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా చేసి ఉన్నా కస్టమర్లపై కొద్ది కొద్దిగా భారం పడుతూ వచ్చేది. చమురు కంపెనీలు తమపై పడుతున్న భారాన్ని కస్టమర్లపై మోపాలని యోచిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే ప్రతి లీటరు పెట్రోల్‌పై సుమారు రూ.8 వరకూ పెరిగే ఆస్కారం ఉంది.
దీనికి భారతీయ రిజర్వు బ్యాంక్ కూడా చమురు కంపెనీలకే మద్దతు పలుకుతోంది. ఆర్థిక సమస్యలను నిలవరించాలంటే పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచడం అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరుగుతాయనే దానిపై వాహన చోదకులు దృష్టంతా నెలకొని ఉంది. మొత్తమ్మీద ఎవరు ఎటుపోయినా, ఏది ఏమైనా తుదకు బలయ్యేది మాత్రం వినియోగదారుడే.


Click it and Unblock the Notifications









