జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు మంచి భవిష్యత్తు ఉంది: రతన్ టాటా
భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్)కు మంచి భవిష్యత్తు ఉందని టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా అన్నారు. అయితే, టాటా స్టీల్ యూరప్‌కు మాత్రం కొన్ని పెట్టుబడులు అవసరమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
"జాగ్వార్ ల్యాండ్ రోవర్ భవిష్యత్తు చాలా బాగుంది, చైనా ఇప్పుడు రెండవ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. పెట్రోల్ ధరలు పెరగనంత వరకూ దీనికి మరింత మంచి భవిష్యత్తు ఉంటుందని మేము ఆశిస్తున్నామ"ని ఎస్‌సిసిఐ నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమావేశంలో రతన్ టాటా చెప్పారు.
గతంలో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం కారణంగా దాదాపు దివాళా స్థాయికి చేరుకున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను 2008లో టాటా మోటార్స్ 1.5 బిలియన్ పౌండ్లు వెచ్చించి ఫోర్డ్ నుంచి కొనుగోలు చేసింది. రతన్ టాటా సారథ్యంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ అప్పటి నుండి ఇప్పటి వరకూ అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతుంది.


Click it and Unblock the Notifications









