గ్రాండ్ చిరోకీతో ఇండియన్ మార్కెట్లోకి రానున్న జీప్

ప్రపంచవ్యాప్తంగా ఎస్‌యూవీల తయారీలో పేరుగాంచిన కంపెనీలలో ఒకటైన "జీప్" త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. జీప్ నుండి అత్యంత పాపులర్ అయిన 'గ్రాండ్ చిరోకీ' మోడల్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేయటం ద్వారా ఇండియాలోకి ప్రవేశించాలని ఈ కంపెనీ భావిస్తోంది.

ఇటలీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫియట్, జీప్ బ్రాండ్‌ను ఇండియాకు తీసుకురానుంది. చిరోకీ తర్వాత పాట్రియోట్, కమాండర్, కంపాస్ మోడళ్లను కూడా ఫియట్ ఇండియాకు తీసుకురానుంది. భారత మార్కెట్లో జీప్ స్థిరత్వాన్ని ఏర్పరుచుకున్న అనంతరం క్రిస్లర్, డాడ్జ్ మోడళ్లను కూడా ఇండియాకు తీసుకువచ్చే ఆస్కారం ఉంది.


ఇక గ్రాండ్ చిరోకీ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఈ మోడల్‌ను తొలిసారిగా 1992లో ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న చిరోకీ నాల్గవ తరానికి (ఫోర్త్ జనరేషన్) చెందినది. ఆఫ్-రోడ్ అడ్వెంచర్లు చేయడానికి చిరోకీ పెట్టింది పేరు. విలాసవంతమైన ఫీచర్లతో లభ్యం కానున్న ఈ మోడల్ అత్యంత సురక్షితమైనది. దీని భద్రతా ఫీచర్ల ద్వారా ఇది సుమారు 30 వరకూ అవార్డులను సొంతం చేసుకుంది.

గంభీరంగా కనిపించే ఈ జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్‌యూవీలో శక్తివంతమైన 3-లీటర్, వీ6 సిఆర్‌డి డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. గంటకు గరిష్టంగా 203 కి.మీ. వేగంతో పరుగులు పెట్టే ఈ కారు కేవలం 8.2 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇందులో 'సెలెక్-టెర్రైన్' అనే ఆఫ్-రోడ్ ఫీచర్ ఉంటుంది. ఇది ఇసుక/బురద, మంచు, రాళ్లు, స్పోర్ట్, ఆటో అనే ఐదు డ్రైవింగ్ మోడ్‌లను సపోర్ట్ చేస్తుంది.

ఏ రోడ్లకు సంబంధిత డ్రైవింగ్ మోడ్‌ను సెలక్ట్ చేసుకొని సౌకర్యవతంగా డ్రైవ్ చేయవచ్చు. ఇందులో ఎనిమిది ఎయిర్‌బ్యాగ్స్, అన్ని (నాలుగు) చక్రాలకు డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సి), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎన్‌హాన్స్‌డ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. భారత మార్కెట్లో జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్‌యూవీ ధర రూ.40 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Thursday, April 19, 2012, 13:02 [IST]
English summary
One of the biggest names in the SUV world, Jeep is all set to enter the Indian market by launching its popular Grand Cherokee model. SUVs have been always loved in India for their capability and comfort in Indian conditions.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+