ఇండియాలోనే కార్లను అసెంబ్లింగ్ చేయనున్న జేఎల్ఆర్
ప్రస్తుతం భారత మార్కెట్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లు చాలా తక్కువ మొత్తంలో అమ్ముడవుతున్నాయని, భవిష్యత్తులో ఈ బ్రాండ్ మార్కెట్ పరిమాణం పెరిగితే ఖచ్చితంగా వీటిని ఇక్కడి మార్కెట్లోనే అసెంబ్లిగ్ చేస్తామని జాగ్వార్ గ్లోబల్ బ్రాండ్ డైరెక్టర్ అడ్రియాన్ హాల్‌మార్క్ తెలిపారు. ల్యాండ్ రోవర్ అందిస్తున్న లగ్జరీ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) ఫ్రీల్యాండర్‌ను మాత్రమే టాటా మోటార్స్ పూనే తమ యూనిట్‌లో అసెంబ్లింగ్ చేస్తుంది.
అయితే భారత్‌లో ఎక్కడ అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. గడచిన ఆర్థిక సంవత్సరం (2010-11)లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారత మార్కెట్లో 891 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇవి 242 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఓ ఇంజన్ ప్లాంటును కూడా ఏర్పాటు చేయాలని జేఎల్ఆర్ సన్నాహాలు చేస్తుంది.


Click it and Unblock the Notifications









