ఒకే కారును పేరు, డిజైన్ మార్చి విక్రయిస్తున్న కార్ కంపెనీలు

ఉదాహరణకు ఇప్పటికే మార్కెట్లో విడుదలైన నిస్సాన్ మైక్రా, మైక్రాను ఆధారంగా చేసుకుని రీనాల్ట్ రూపొందించిన పల్స్ హ్యాచ్‌బ్యాక్‌లు. భారత్‌లో ఈ రీనాల్ట్-నిస్సాన్ కంపెనీలు సంయుక్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దీంతో ఒకే కారుని, డిజైన్ పరంగా మార్పులు చేర్పులు చేసి, ఒకే ఇంజన్‌తో రెండు వేర్వేరు పేర్లతో అందిస్తున్నాయి.
ఇదే విధంగా, త్వరలో ఫోక్స్‌వ్యాగన్ నుండి మార్కెట్లోకి రానున్న అప్ హ్యాచ్‌బ్యాక్, స్కొడా నుండి రానున్న సిటిగో కార్లు కూడా ఇదే ఫిలాఫిసీని పాటించనున్నాయి. ఈ రెండు కంపెనీలు కూడా ఒకే గ్రూపు సంస్థ (ఫోక్స్‌వ్యాగన్)కు చెందినవే. ఇప్పటికే ఈ రెండు కంపెనీ భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్న తమ చిన్న కార్ల చిత్రాలను విడుదల చేశాయి. పేర్లు వేర్వేరే అయినప్పటికీ వీటి పవర్ మాత్రం ఒకేలా ఉండనుంది.
ఫోక్స్‌వ్యాగన్ ఇప్పటికే విడుదల చేసిన వెంటో సెడాన్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని స్కొడా బ్రాండ్ క్రింద ర్యాపిడ్ అనే మోడల్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు రీనాల్ట్ తాజాగా.. నిస్సాన్ సన్నీ సెడాన్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని సి-సెగ్మెంట్లో మరో చౌక సెడాన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే రానున్న రోజుల్లో మరిన్న కార్లు వివిధ బ్రాండ్ పేర్లతో అమ్ముడు కావడం ఖాయం..!!


Click it and Unblock the Notifications








