అత్యంత ఖరీదైన కారుతో ప్రేమలో పడిన యూనివర్సల్ హీరో

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన అత్యంత విలాసవంతమైన ఎస్‌యూవీ రేంజ్ రోవర్ ఎవోక్‌ను కమల్ ఫ్లాట్ అయిపోయాడు.
ఇంకేముంది వెంటనే వెళ్లి ప్రత్యేక ఆర్డర్ మీద తన ప్రియమైన కారును ఇంటికి తెచ్చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా, ఈ కారులో చెన్నై మొత్తం చక్కర్లు కొడుతున్నాడట. ఇప్పుడు సిటీలో ఇదే హాట్ టాపిక్‌గా మారిపోయింది. కమల్ హాసన్ వద్ద ఇదే కాకుండా, ఓ టొయోటా ప్రాడో ప్రీమియం ఎస్‌యూవీ, ఆడి ఏ8 ప్రీమియం సెడాన్ కార్లు కూడా ఉన్నాయట.
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీ విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ను సంపాధించుకొని, భారీ ముందస్తు ఆర్డర్లను సొంతం చేసుకుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారత్‌లో అందిస్తున్న ఈ క్రాసోవర్ ఎస్‌యూవీ ధర రూ.44.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
ప్రీమియం లుక్‌నిచ్చే ఎక్స్టీరియర్స్, విలాసవంతమైన ఇంటీరియర్స్‌తో రూపొందిన అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీ ఇది. ఇది మూడు వేరియంట్లలో (ప్యూర్, ప్రెస్టీజ్, డైనమిక్) లభ్యమవుతుంది. మరి ఇందులో కమల్ హాసన్ ఏ వేరియంట్ కొనుగోలు చేశాడో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








