కార్ లోన్స్ కోసం కర్ణటాక బ్యాంక్‌తో టాటా మోటార్స్ డీల్

దేశపు అగ్రగామి కార్ కంపెనీల్లో ఒకటైన టాటా మోటార్స్, తమ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు సులువుగా రుణ సదుపాయం కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కర్ణాటక బ్యాంక్‌తో చేతులు కలిపింది. ఈ మేరకు కర్ణాటక బ్యాంక్ మరియు టాటా మోటార్స్ కంపెనీల మధ్య ఓ ఒప్పందం కుదింరింది.

ఈ ఒప్పందంలో భాగంగా, టాటా మోటార్స్ అందిస్తున్న వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి సరసమైన వడ్డీ ధరలకే వివిధ ఈఎమ్ఐ ఆప్షన్ల సౌకర్యంతో కర్ణాటక బ్యాంక్ వాహన రుణాలను అందిస్తుంది. కర్ణాటక బ్యాంక్ ఆఫర్ చేస్తున్న సిజిటిఎమ్‌ఎస్ఈ (క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్) అనే స్కీమ్‌ క్రింద ఈ కార్ లోన్స్‌ను బ్యాంక్ మంజూరు చేస్తుంది.


ఇటీవలి రోజుల్లో కార్ లోన్లను పొందటం చాలా క్లిష్టంగా మారిపోయింది. పెరుగుతున్న వడ్డీ రేట్లతో బెంబేలెత్తిపోతున్న కస్టమర్లు కార్ లోన్ల జోలికి వెళ్లాంటేనే జంకుతున్నారు. అలాగే, కార్ లోన్లను తీసుకున్న తర్వాత వాటి ఈఎమ్‌ఐలను కట్టకుండా బ్యాంక్‌లకు పంగనామాలు పెట్టే కస్టమర్లు కూడా ఎక్కువ అవుతుండటంతో ఇటు బ్యాంక్‌లు కూడా రుణాలు మంజూరు చేయాలంటే ఒకటి నాలుగు సార్లు ఆలోచించే పరిస్థి ప్రస్తుతం మార్కెట్లో నెలకొని ఉంది.

ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్‌కు, కర్ణాటక బ్యాంక్‌కు మధ్య కుదిరిన ఈ తాజా ఒప్పందం వలన కార్ లోన్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఇటు టాటా మోటార్స్, అటు కర్ణాటక బ్యాంక్ రెండూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ కార్లు తగ్గుముఖం పడుతున్న తరుణంలో టాటా మోటార్స్ అందించనున్న ఆఫర్లకు తోడు కర్ణాటక బ్యాంక్ అందించనున్న స్కీమ్‌ల వలన వీటి అమ్మకాలు పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, June 25, 2012, 10:22 [IST]
English summary
Tata Motors has now made car loans easier to get at least for the customers of Karnataka Bank. The Indian carmaker has signed a memorandum of understanding with Karnataka Bank to provide easy car loans to the bank's customers. Karnataka Bank has released a press release in this regard.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+