నిస్సాన్ స్పోర్ట్స్ కారును కొనుగోలు చేసిన నాగార్జున

Nagarjuna
టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం గుండు చేయించుకొని ఓ కొత్త లుక్‌లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు నాగార్జున కొత్త లుక్‌తో పాటు కొత్త కారలో కూడా కనిపించనున్నాడు. జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ నుండి నాగార్జున ఓ సరికొత్త స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశారు.

మహారాష్ట్ర నుండి నాగార్జున ఈ కారును కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో అడ్రెస్ మార్పు, కొత్త రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం నాగార్జున జనవరి 11న ఖైరతాబాద్‌లోని ఆర్టోవీ ఆఫీసుకు విచ్చేసి యాజమాన్య మార్పునకు సంబంధించి రవాణా కార్యాలయంలో డిజిటల్ సంతకం చేశారు.

ఆర్టీవో వర్గాల ప్రకారం, నెంబర్ మార్పు కోసం నాగార్జున రూ.5,000 రుసుమును చెల్లించగా, AP09 C 9669 అనే నెంబర్‌ను ఆర్టీఏ కేటాయించినట్లు సమాచారం. ప్రస్తుతం నిస్సాన్ భారత మార్కెట్లో అందిస్తున్న 370జెడ్, జిటిఆర్ అనే స్పోర్ట్ కార్లను అందిస్తుంది. బహుశా నాగార్జున కొనుగోలు చేసిన కారు నిస్సాన్ 370 జెడ్ అయి ఉండొచ్చని అంచనా.

ఈ సందర్భంగా కింగ్ నాగార్జున వాహన చోదకులను ఉద్దేశించి కొన్ని సూచనలు చేసారు. వాహనం డ్రైవ్ చేస్తున్న తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని, అలాగే, బైక్‌లు రైడ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించాలని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Friday, January 13, 2012, 12:02 [IST]
English summary
Tollywood handsome hero Akkineni Nagarjuna has bought a Nissan Sports car from Maharashtra, for the change of address and new registration number he visited the RTO office at Khairatabad on January 11, 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+