ముంబైలో కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేయనున్న లాంబోర్గినీ

ప్రపంచంలోనే అత్యంత వేగంతో పరుగులు తీసే సూపర్‌కార్లను తయారు చేసే, ప్రముఖ ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లాంబోర్గినీ ఇండియాలో తన రెండవ షోరూమ్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మరో షోరూమ్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని లాంబోర్గినీ ప్రకటించింది.

గడచిన ఆరేళ్ల క్రితం న్యూఢిల్లీలో లాంబోర్గినీ తన మొట్టమొదటి షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలోని షోరూమ్‌ను ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ నిర్వహిస్తుండగా, ముంబైలోని షోరూమ్‌ను ఆటో హ్యాంగర్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించనుంది. వేసవి సీజన్‌ నాటికి ఈ కొత్త షోరూమ్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ముంబైలోని ప్రభాదేవి ఏరియాలో ఈ కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేయాలని లాంబోర్గినీ భావిస్తుంది. ఈ ఏరియాలో ఇప్పటికే స్కొడా, ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్ వంటి కెపనీల షోరూమ్‌లు ఉన్నాయి. ముంబైలో గల్లార్డో కార్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇండియా రెండవ షోరూమ్‌ను ఏర్పాటు చేసేందుకు లాంబోర్గినీ ముంబైను ఎంచుకుంది.

ప్రస్తుతం లాంబోర్గినీ దేశీయ విపణిలో గల్లార్డో, అవంటేడర్ అనే రెండు మోడళ్లను మాత్రమే విక్రయిస్తుంది. ఈ రెండు మోడళ్లను పూర్తిగా విదేశాల్లో తయారైనవి. వీటిని ఇండియాకు సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకుని దేశీయ విపణిలో విక్రయిచడం జరుగుతుంది. 2012లో ఇండియాలో 30 కార్లను విక్రయించాలని లాంబోర్గినీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరో షోరూమ్‌ను ఏర్పాటు చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 15, 2012, 12:45 [IST]
English summary
Italian sports carmaker Lamborghini is heading to open another showroom in India. Company has already established its first showroom in New Delhi about 6 years ago. According to reports, inauguration ceremony of the new Lamborghini showroom will take place during the summer season.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+