జెనీవాలో కన్వర్టబిల్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన ల్యాండ్ రోవర్
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌కు చెందిన బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఎస్‌యూవీ "రేంజ్ రోవర్ ఎవోక్"లో కంపెనీ తొలిసారిగా డిజైన్ చేసిన కన్వర్టిబిల్ వేరియంట్‌ను ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న 82వ అంతర్జాతీయ ఆటో షోలో ఆవిష్కరించి చూపరులను కట్టపడేసింది.
జేఎల్ఆర్ ప్రదర్శించిన ఈ రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టబిల్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి కన్వర్టబిల్ ఎస్‌యూవీ కావటం విశేషం. ఇందులో ఆటోమేటిక్‌గా పనిచేసే సాఫ్ట్ రూఫ్ ఉంటుంది. కారు లోపల డ్యాష్‌బోర్డులో ఓ చిన్న స్విచ్‌ను ప్రెస్ చేయగాన్ కారు పైభాగం (రూఫ్) వెనుక వైపు బూట్‌స్పేస్ లోనికి ముడుచుకుని కన్వర్టబిల్‌గా మారిపోతుంది.
ఈ రూఫ్ బరువు సుమారు 80 కిలోలు ఉంటుంది. అంటే సాధారణ స్టాండర్డ్ వెర్షన్ 3-డోర్ రేంజ్ రోవర్ ఎవోక్‌లో ఉపయోగించే రూఫ్ కన్నా అధిక బరువును కలిగి ఉంటుంది. దీంతో పాటుగా ల్యాండ్ రోవర్ డిసి 100 కాన్సెప్ట్ కారును కూడా జాగ్వార్ ల్యాండ్ రోవర్ జెనీవా మోటార్ షోలో ప్రదర్శించింది. ఈ ఆటో షోలో రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబిల్ ఎస్‌యూవీ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.


Click it and Unblock the Notifications









