రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశించిన సరికొత్త పుంటో, లీనియా
అంతేకాకుండా, కొత్త పుంటో, లీనియా కార్ల ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్స్‌ను నవీకరించామని, ఎయిర్ బ్యాగ్స్, పవర్ విండోస్, ఇన్ఫోటెయిన్‌మెంట్ సిస్టమ్, ఎయిర్ కండిషనింగ్ సౌకర్యాలను కూడా మెరుగుపరిచామని టాటా మోటార్స్ ఏజీఎం-ఫియట్ బ్రాండ్స్ పియూష్ లాల్ తెలిపారు. ఈ రెండు మోడళ్లు కూడా పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నాయి.
ఫియట్ కార్ల కోసం ప్రత్యేకించి హైదరాబాద్‌లో ఫియట్ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్ ఏర్పాటు చేసే విషయాన్ని కంపెనీ పరిశీలిస్తోంది. ప్రస్తుతం టాటా మోటార్స్-ఫియట్ కంపెనీలు సంయుక్తంగా తమ కార్లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. హైదారాద్‌లో లభిస్తున్న పుంటో, లీనియా సెడాన్‌ల వేరియంట్లు, ఎక్స్-షోరూమ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
రాష్ట్ర మార్కెట్లో 2012 ఫియట్ పుంటో పెట్రోల్ వెర్షన్ కారు ధరలు రూ.4.89 లక్షల నుండి రూ.6.65 లక్షల మధ్యలో ఉన్నాయి. ఇది 1.2 ఫైర్ లీటర్, 1.4 ఫైర్ లీటర్ పెట్రోల్ మరియు 1.3 మల్టీజెట్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. డీజిల్ వెర్షన్ 2012 పుంటో ధర రూ.5.57 లక్షల నుండి రూ.6.83 లక్షల మధ్యలో ఉంది. 1.2 ఫైర్ పెట్రోల్ వెర్షన్ 2012 పుంటో లీటరుకు 15.2 కి.మీ. మైలేజీని, 1.4 ఫైర్ పెట్రోల్ వెర్షన్ 2012 పుంటో లీటరుకు 14.6 కి.మీ. మైలేజీని, డీజిల్ వెర్షన్ పుంటో 20.3 కి.మీ. మైలేజీని ఇస్తుంది.
ఇకపోతే 2012 లీనియా సెడాన్ 1.3 అడ్వాన్స్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్, 1.4 ఫైర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తుంది. 2012 ఫియట్ లీనియా డీజిల్ వెర్షన్ సెడాన్ ధరలు రూ.7.94 లక్షల నుండి రూ.9.32 లక్షల మధ్యలో ఉండగా,
పెట్రోల్ వెర్షన్ లీనియా సెడాన్ ధరలు రూ.6.92 లక్షల నుండి రూ.7.91 లక్షల మధ్యలో ఉన్నాయి. డీజిల్ వెర్షన్ 2012 లీనియా సెడాన్ లీటర్ డీజిల్‌కు 20.4 కి.మీ. మైలేజీని, పెట్రోల్ వెర్షన్ 2012 లీనియా సెడాన్ లీటరుకు 14.6 కి.మీ. మైలేజీనిస్తుంది.


Click it and Unblock the Notifications









