డీజిల్ విక్రయంపై భారీగా నష్టపోతున్న చమురు కంపెనీలు

ప్రస్తుతం చమురు కంపెనీలు విక్రయిస్తున్న డీజిల్‌ను సబ్సిడి ధరకే అందిస్తున్న సంగతి తెలిసిందే. వీటి ధరల నియంత్రణ ప్రభుత్వ అధీనంలో ఉంది. దీంతో సబ్సిడికే డీజిల్‌ను విక్రయిస్తుండటం వలన చమురు కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ఇదివరకెన్నడూ లేని విధంగా చమురు సంస్థలు రికార్డు స్థాయిలో ప్రతి లీటరు డీజిల్ విక్రయంపై రూ.19.26 చొప్పున నష్టపోతున్నాయి.

కేవలం డీజిల్ మాత్రమే కాకుండా, వంట గ్యాస్ (ఎల్‌పిజి), కిరోసిన్‌లను కూడా సబ్సిడి ధరలకే అందిస్తుండటంతో చమురు కంపెనీలపై మరింత భారం పడుతోంది. గడచిన సంవత్సరం జూన్‌ నెల నుంచి డీజిల్‌తో పాటు వంటగ్యాస్‌, కిరోసిన్‌ ధరలను పెంచలేదు. కానీ ఈ ఉత్పత్తుల ధరలు మాత్రం అమాతం 28 శాతం మేర పెరిగిపోయాయని చమురుశాఖ వర్గాలు వాపోతున్నాయి.

భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసి)తో పాటు హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పిసిఎల్‌), భారత్‌ పెట్రోలియం వంటి కంపెనీలు ప్రభుత్వ నిర్దేశించిన సబ్సిడి ధరకే డీజిల్‌, ఎల్‌పిజి, కిరోసిన్‌లు విక్రయిస్తుండటం వలన, ఈ కంపెనీలు ప్రతి రోజు సుమారు రూ.560 మేర నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రతి లీటర్ డీజిల్‌‌ను రూ.19.26 నష్టానికి అలాగే లీటర్ కిరోసిన్‌‌ను రూ.34.34 నష్టానికి, కేజీ వంటగ్యాస్‌‌ను
రూ.347 14.2 నష్టానికి విక్రయిస్తున్నారు.

ప్రస్తుతం డీజిల్ సబ్సిడి భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ వస్తుంది. అయితే, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో డీజిల్‌ ధరలపై ప్రభుత్వం తమ నియంత్రణలను ఎత్తివేయటమో లేదా ఒక్కసారిగా డీజిల్ ధరలను భారీగా పెంచడమో జరిగే ఆస్కారం ఉంది. గత ఏప్రిల్ నెలలో లీటరు డీజిల్‌పై నష్టం రూ.16.16గా ఉండగా, అది కాస్తా పెరిగి ప్రస్తుతం రూ.19.26 స్థాయికి చేరింది.

ఈ నష్టాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోయినట్లయితే, ఇది వచ్చే ఏడాది మార్చి 31 నాటికి రూ.1,92,951 కోట్లకు ఎగబాకే అవకాశం ఉంది. కాగా.. గత జూన్‌ 2010లో పెట్రోల్ ధరలపై ప్రభుత్వం తమ నియంత్రణలు ఎత్తివేసినప్పటి తర్వాతి నుంచి, చమురు కంపెనీలు అనేకసార్లు పెట్రోల్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తాము లీటరు పెట్రోలు విక్రయంపై రూ.4.85 చొప్పున నష్టపోతున్నామని, ఇందుకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని చమురు కంపెనీలు అంటున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, September 4, 2012, 13:11 [IST]
English summary
Losses on sale of diesel at government-controlled rates have hit a record Rs 19.26 a litre, sending state-owned oil companies scrambling for ways to cover the mounting losses.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+