కేవలం రూ.35,000 లకే రోడ్డుపై, నీటిపై ప్రయాణించే కార్..

పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని తంజావూరులోని ప్రీస్ట్ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు తమ అత్యుత్తమ ప్రతిభా పాఠవాలకు పదును పెట్టి రెండు అరుదైన కార్లను అభివృద్ధి చేశారు.
ఇందులో ఒక కారు పెట్రోల్, ఎల్‌పిజి ఇంధనాలతో నడవగా, మరొక కారు సౌరశక్తిని విధ్యుత్‌చ్ఛక్తిగా మార్చుకుని బ్యాటరీ పవర్ ఆధారంగా ఇటు రోడ్డుపై, అటు నీటిలోనూ (యాంపిబియన్ కార్) సవారీ చేస్తుంది. హై-టెక్ ప్రాజెక్ట్ ఇండస్ట్రీస్, ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ సర్వీస్ కంపెనీల సహకారంతో ప్రీస్ట్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ కార్లను డిజైన్ చేశారు.
ఈ రెండు కార్లను కూడా స్టీల్, అల్యూమినియం అల్లాయ్స్, ప్లాస్టిక్స్, స్థానికంగా లభించే ఇతర పధార్థాలతో రూపొందించారు. ఒక్కొక్క కారును రూపొందించేందుకు రూ.35,000 కంటే తక్కువ ఖర్చు అయ్యిందని హై-టెక్ ప్రాజెక్ట్ ఇండస్ట్రీస్ పరిశోధకలు తెలిపారు.
ఎలక్ట్రిక్ కారు ఇటు రోడ్డుపై గంటకు 30 కి.మీ. వేగంతోనూ, అటు నీటిపై గంటకు 15 కి.మీ. వేగంతోనూ పరుగులు తీస్తుంది, ఇది పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనది.
ఇకపోతే 110సీసీ పెట్రోల్/ఎల్‌పిజి కారు కేవలం 135 కేజీల బరువును మాత్రమే కలిగి ఉండి గరిష్టంగా గంటకు 50 కి.మీ. వేగంతో రోడ్డుపై పరుగులు పెడుతుంది. ఈ కారును పెట్రోల్‌తో నడిపితే లీటరుకు 65 కి.మీ. మైలేజీని, ఎల్‌పిజితో నడిపినట్లయితే కేజీకు 110 కి.మీ. మైలేజీనిస్తుందని విద్యార్థులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications








