వరల్డ్ లోయెస్ట్ రోడ్‌వర్తీ కారుగా గిన్నిస్‌కెక్కిన 'మిరాయ్'

By Ravi

Mirai
ఈ ఫోటోలో కనిపిస్తున్న బుజ్జి కారును చూశారా..? దీని పేరు 'మిరాయ్' (Mirai). ఇది ప్రపంచంలో కెల్లా రోడ్డుపై అత్యంత తక్కువ పరిమాణం కలిగిన కారుగా గిన్నిస్ బుక్‌‌లో స్థానం దక్కించుకుంది. జపాన్‌కు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ బుజ్జి కారుకు రూపకల్పన చేశారు.

మిరాయ్ అంటే జపనీస్ భాషలో 'భవిష్యత్తు' (ఫ్యూచర్) అని అర్థం. భవిష్యత్తులో ఇలాంటి చిన్న కార్ల ఆవశ్యకతను ప్రతిభింభించేలా, జపాన్‌లోని ఆసకుచిలో ఉన్న ఓకాయమా శాన్యో హై స్కూల్‌లోని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కారును తయారు చేశారు.

ఈ మిరాయ్ కారు ఎత్తు కేవలం 45.2 సెంటీమీటర్లు మాత్రమే. ఈ రికార్డ్ బ్రేకింగ్ కారును తయారును చేయటానికి వారికి సుమారు ఏడాదికి పైగా సమయం పట్టిందట. ఇందులో ఎక్కువ నెలలను కేవలం డిజైన్, ప్లానింగ్‌కు కేటాయించగా, కేవలం 6 నెలల్లోనే దీని ప్రొడక్షన్ వెర్షన్‌ను తయారు చేశామని విద్యార్థులు తెలిపారు.

ఈ ప్రాజెక్టులో 15-18 ఏళ్ల వయస్సు కలిగిన 12 మంది విద్యార్థులు, 9 మంది టీచర్లు పాల్గొన్నారు. ఈ చిన్న కారులో ఒక్కరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, October 12, 2012, 15:41 [IST]
English summary
Introducing "Mirai", featured in the new Guinness World Records 2013 book for being the Lowest Roadworthy Car. "Mirai", which means 'future' in Japanese, measures 17.79 in (45.2 cm) from the ground to highest part of the car. It was created by students and teachers of The Automobile Engineering Course at Okayama Sanyo High School in Asakuchi, Japan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+