మార్చి నెలాఖరునాటికి లక్ష జైలోలను విక్రయిస్తాం: మహీంద్రా

ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సరికొత్త 2012 జైలో ఎమ్‌పివి (బహుళ ప్రయోజన వనాహనం)ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోపుగా లక్ష యూనిట్లకు పైగా విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మహీంద్రా అండ్ మహీంద్రా తొలిసారిగా జైలో ఎమ్‌పివిని జనవరి 13, 2009లో దేశీయ విపణిలో విడుదల చేసింది.

మహీంద్రా జైలో ఆర్థిక మాంద్యం సమయంలో విడుదలైనప్పటికీ, మార్కెట్లో మంచి ఆదరణను పొంది, ఇప్పటి వరకూ సుమారు 90,000 యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసుకుని కంపెనీకు బెస్ట్ సెల్లింగ్ ఎమ్‌పివిగా నిలిచింది. జైలో ద్వారా దేశీయ ఎమ్‌పివి సెగ్మెంట్లో ఎమ్ అండ్ ఎమ్ 27 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోగలిగింది. నాసిక్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా ప్లాటులో జైలో ఎమ్‌పివి ఉత్పత్తి అవుతోంది.

మహీంద్రా కొత్తగా విడుదల చేసిన ఎమ్‌పివి ధరలు రూ.7.37 లక్షల నుండి రూ.10.24 లక్షలు (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉన్నాయి. గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం రూపొందించిన కొత్త జైలోను ప్రపంచ మార్కెట్లలో కూడా ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగా, తొలుత కుడిచేతి వాటం డ్రైవ్ కలిగిన మార్కెట్లలో కూడా ఈ మోడల్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, February 13, 2012, 12:04 [IST]
English summary
Mahindra and Mahindra has already sold more than 90,000 Xylo multi utility vehicles (MUVs) since its launch in Jan 2009, taking its market share in this segment to 27 per cent. Now company is expecting to cross 1,00,000 sales before the current financial year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+