హవ్వ ఇదేం సిత్రం.. చైనా 800 కారుకు మూడే చక్రాలు..!!

చైనా వాళ్లు 'మేము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు' అనే రకం. కుందేలు వరకూ మాత్రమే అయితే పర్లేదు.. కానీ మనదేశంలో అత్యంత పాపులర్ అయిన మారుతి 800 కారు కూడా మూడే చక్రాలు అంటున్నారు. ఈ ఫోటోలో ఉన్న కనిపిస్తున్న కారును చూశారు కదా.. ఇదేదో పాడుబడిన మారుతి 800 కారును మోడిఫై చేశారనుకుంటే మీరు కారులో కాలేసినట్లే.

ఎందుకంటే ఇది మేడ్ ఇన్ చైనా మారుతి 800 కాబట్టి. చైనాలోని 'జినాన్ క్వింగ్‌క్వి మోటార్‌సైకిల్ కార్పోరేషన్' అనే కంపెనీ త్రీ-వీలర్ వెర్షన్ ఆల్టో (ఇండియాలో మారుతి 800) కారును తయారు చేసింది. ఇందులో 125 సీసీ, 12 కి.వా. మోటార్‌బైక్‌ను ఉపయోగించడం జరిగింది. ఈ కారులో ముందు వైపు ఒక్క చక్రం మాత్రమే (కారు మధ్య భాగంలో) అమర్చబడి ఉంటుంది.

ఇక దీని ధర విషయానికి వస్తే మన కరెన్సీలో సుమారు 75 నుండి 80 వేల రూపాయల వరకూ ఉండొచ్చు. ఇప్పటి వరకూ ప్రతి మొబైల్ ఫోన్‌కు డూప్లికేట్ మొబైల్ ఫోన్ తయారు చేస్తూ వచ్చిన చైనా కంపెనీలు ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీలపై పడ్డట్లున్నాయి. ఏదేమైనప్పటికి చైనా వాళ్లు మాత్రం మామూలు వాళ్లు కాదండోయ్.. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Thursday, March 8, 2012, 11:01 [IST]
English summary
China based motorcycle company 'Jinan Qingqi Motorcycle Corporation' has produced the three-wheeled version of the Alto (Maruti 800 in India) with a 125cc, 12KW motorbike engine CarNewsChina reported.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+