ఘానాలో మేడ్ ఇన్ ఇండియా అశోక్ లేలాండ్ బస్సులు
ఆఫ్రికాలో మేడ్ ఇన్ ఇండియా బస్సులు హల్ చల్ చేయనున్నాయి. దేశపు అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ కంపెనీ, హిందూజా గ్రూపునకు చెందిన అశోక్ లేలాండ్ ఆఫ్రికాలోని ఘానాకు 100 పాల్కన్ బస్సులను సప్లయ్ చేసింది. ఈ డీల్ విలువ 7.6 మిలియన్ డాలర్లు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.42 కోట్లు.
ఘానాలోని ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ మెట్రో మాస్ ట్రాన్సిస్ట్ లిమిటెడ్‌కు అశోక్ లేలాండ్ సరఫరా చేసింది. ఈ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో ఘానా ప్రభుత్వానికి 45 శాతం వాటా ఉంది. ఇంటర్ సిటీ, ఇంట్రా-సిటీ అవసరాల కోసం ఘానాలోని మొత్తం 360 రూట్లలో ఈ బస్సులను ఉపయోగించనున్నారు.
ఘనాకు ఎగుమతి చేసిన ఈ 100 బస్సులన్నింటినీ అక్కడి రవాణా అవసరాలకు అనుగుణంగా, 57 సీట్లు, ఎడమ చేతి వాటం కలిగిన డ్రైవింగ్ ఆప్షన్లతో కస్టమైజ్ చేసినట్లు అశోక్ లేలాండ్ పేర్కొంది. ఘానా నుంచి అశోక్ లేలాండ్‌కు ఇది రెండవ ఆర్డర్. కంపెనీ ఇదివరకే 160 వెస్ట్ మేనేజ్‌మెంట్ ట్రక్కులను సప్లయ్ ఆర్డర్‌ను పొందింది.
ఘానాలో మెకానికల్ ఇన్‌లైన్ ఫ్యూయెల్ ఇంజక్షన్ యూరో 3 ఇంజన్, ఎలక్ట్రానిక్ డెస్టినేషన్ బోర్డ్‌తో కూడిన వాహనాలను ప్రవేశపెట్టిన మొట్టిమొదటి కంపెనీగా అశోక్ లేలాండ్ అవతరించింది. తాము దృష్టి సారిస్తున్న కీలక మార్కెట్లలో ఆఫ్రికా మార్కెట్ కూడా ఒకటని, ఇక్కడి మార్కెట్లలో మంచి అవకాశాలు ఉన్నాయని అశోక్ లేలాండ్ ఎమ్‌డి వినోద్ కె దాసరి తెలిపారు.


Click it and Unblock the Notifications









