మహీంద్రా ట్రాక్టర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు

By Ravi

ఈవేళ ఏదోటి అదరగొడదాం (ఆజ్ కుచ్ తుఫానీ కర్తే హై) అంటూ థమ్స్ అప్ యాడ్ ద్వారా ఆల్-ఇండియా అభిమానాన్ని చూరగొనాలని ప్రయత్నించి విఫలమైన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు మరో నేషనల్ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. థమ్స్ అప్ యాడ్‌లో అబ్బురపరచే స్టంట్‌లు చేసిన అభిమానులు ఆకట్టుకున్న మహేష్ బాబు ఈసారి ట్రాక్టర్ ఎక్కి పొలం దున్ననున్నాడు.

ట్రాక్టర్లు తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన దేశపు ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ట్రాక్టర్స్ యూనిట్ మహీంద్రా ట్రాక్టర్స్‌కు మన ప్రిన్స్ బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించనున్నాడు. వ్యవసాయానికి ప్రధాన్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో ట్రాక్టర్ల అమ్మకాలను పెంచుకునేందుకు, తర్వాతి తరం (నెక్స్ట్ జనరేషన్) రైతుల్లో తమ బ్రాండ్ పట్ల మంచి అవగాహన కల్పించేందుకు మహీంద్రా ట్రాక్టర్స్ తమ ఉత్పత్తులను మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.

Mahesh Babu Becomes The Brand Ambassador Of Mahindra Tractors
ఈ సందర్భంగా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫామ్ వ్యవసాయ పరికరాల విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ అప్లిట్రాక్) సంజీవ్ గోయెల్ మాట్లాడుతూ.. మహింద్రాకు ఆంధ్రప్రదేశ్ కీలకమైన మార్కెట్ అని, ఈ మార్కెట్‌కు తగిన విధంగా తమ ఉత్తులను ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో భూమిపుత్ర 475, 575 ట్రాక్టర్లను అధిక సంఖ్యలో వినియోగిస్తున్నారని, ఇక్కడి మహీంద్రా ట్రాక్టర్స్ ఇతర బ్రాండ్లను డామినేట్ చేస్తూ గడచిన మూడు దశాబ్ధాలకు పైగా మార్కెట్ లీడర్‌గా ఉందని చెప్పారు.

మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవటంపై గోయెల్ మాట్లాడుతూ.. ఉత్తమ మైలేజ్ మరియు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్రాక్టర్లను ఉపయోగించే తర్వాతి తరం రైతులతో కనెక్ట్ అయ్యేందుకు గాను, ఆంధ్రప్రదేశ్‌లో యూత్ ఐకాన్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబును తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నామని చెప్పారు. ఇటు మహీంద్రా, అటు మహేష్ బాబు తమ తమ పరిశ్రమలలో సూపర్ స్టార్లేనని ఆయన గోయెల్ అన్నారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. మహీంద్రా ట్రాక్టర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ కావటం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ కంపెనీ రైతుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసువచ్చిందని, ఆంధ్రప్రదేశ్‌లోని యువ రైతులను కలుసుకోవటాన్ని తాను ఇష్టపడుతానని చెప్పారు. మహేష్ బాబుతో మహీంద్రా ట్రాక్టర్స్‌ తీసిన ఓ యాడ్ ఫిల్మ్ (టెలివిజన్ కమర్షియల్) త్వరలోనే బుల్లితెరలపై విడుదల కానుంది. వివిధ డిజిటల్స ప్రింట్ మీడియాలు, సినిమాల ద్వారా ఇది ప్రసారం కానుంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 18, 2012, 19:49 [IST]
English summary
Mahindra & Mahindra, world’s leading tractor manufacturing company today announced its new brand association with Telugu superstar Mahesh Babu in Andhra Pradesh. The brand ambassador signifies the strong focus of the tractor major towards the Andhra Pradesh market and its steady progress towards creating a young and vibrant brand image amongst the next generation of farmers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+