మహీంద్రా ఎక్స్‌యూవీ500 వెబ్‌సైట్‌లో లక్కీ డ్రా విజేతల వివరాలు

ఇప్పటికే, ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకున్న వారు తమ వద్ద ఉన్న కూపన్ నెంబర్‌ను ఈ వెబ్‌సైట్‌లో ఇచ్చి సెర్చ్ బాక్స్‌లో టైప్ చేసి విజేతల పేర్లలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఎక్స్‌యూవీ500 కోసం గడచిన జనవరిలో ప్రారంభించిన సెకండ్ ఫేజ్ బుకింగ్‌లలో సుమారు 25,000 యూనిట్లకు పైగా ఆర్డర్లు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వాహనాల డెలివరీలో పారదర్శకతను పాటించేందుకు లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి మాత్రమే డెలివరీలు అందిస్తామని కంపెనీ పేర్కొంది.
కాగా.. లక్కీ డ్రాలో తమ పేర్లు రాని వారికి లేదా రిజిస్ట్రేషన్ కోసం వినియోగదారులు చెల్లించిన మొత్తం రూ.80,000 లను తిరిగి కోరుకునే వారికి, కంపెనీ సదరు మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లిస్తుంది. ఈ లక్కీ డ్రా కోసం ప్రముఖ వృత్తి సేవల సంస్థ డెలాయిట్ టచ్ తోహ్మత్సు ఇండియా ప్రై లి (డిటిటిఐపిఎల్)తో మహీంద్రా అండా మహీంద్రా జట్టు కట్టింది. మరి లక్కీ విజేతల పేర్లలో మీ పేరు కూడా ఉందో లేదో ఇప్పుడే చూసుకోండి.


Click it and Unblock the Notifications








