రష్యాలో కార్లను అసెంబ్లిగ్ చేయనున్న ఎమ్ అండ్ ఎమ్
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ప్రపంచ మార్కెట్లలోనూ తన ప్రావీణ్యం చాటుకోవాలని తహతహలాడుతోంది. ఎమ్ అండ్ ఎమ్ కొనుగోలు చేసిన కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ శాంగ్‌యాంగ్‌తో కలిసి అంతర్జాతీయ మార్కెట్లలో కార్యకాలాపాలను విస్తృతం చేసే దిశగా అడుగులు వేస్తుంది.
ఇందులో భాగంగానే రష్యాలో తమ వాహనాలను అసెంబ్లింగ్ చేయాలని భావిస్తున్నామని కంపెనీ ఆటోమోటివ్ డివిజన్ హెడ్ పవన్ గోయెంకా తెలిపారు. మహీంద్రా ఉత్పత్తులను రష్యాలో అసెంబ్లింగ్ చేసేందుకు గానూ రష్యాలోని శాంగ్‌యాంగ్ డిస్ట్రిబ్యూటర్‌తో చర్చలు జరుగుతున్నాయని, అయితే ఈ చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని, దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు.
సికెడి (కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్) రూట్లో మహీంద్రా వాహనాలను రష్యాకు దిగుమతి చేసుకొని, అసెంబ్లింగ్ చేసి అక్కడి మార్కెట్లో విక్రయించడం జరుగుతుందని గోయెంకా చెప్పారు. గ్లోబల్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా మహీంద్రా అండ్ మహీంద్రా రూపొందించిన లేటెస్ట్ ఎస్‌యూవీ "ఎక్స్‌యూవీ500"ను, ఫేస్‌లిఫ్ట్ ఎమ్‌యూవీ 2012 జైలో మోడళ్లను కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications









