కొత్త వెరిటో ఎఫెక్ట్: పెరిగిన మహీంద్రా ఆగస్టు అమ్మకాలు
గడచిన నెలలో మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ అమ్మకాలు 20 శాతం వృద్ధిని సాధించి 42826 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం సంవత్సరం ఇదే సమయంలో ఇవి 35756 యూనిట్లుగా ఉన్నాయి. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు (యుటిలిటీ వాహనాలు, వెరిటో) 39 శాతం వృద్ధిని సాధించి 15664 యూనిట్ల నుంచి 21831 యూనిట్లకు పెరిగాయి.ఎగుమతులు కూడా 56 శాతం వృద్ధిని సాధించాయి.
ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ షా మాట్లాడుతూ.. ప్రతికూల పోటీతత్వ మార్కెట్ పరిస్థితుల్లోనూ 22 శాతం వృద్ధిని సాధించటం తమకెంతో సంతోషంగా ఉందని, ఇటీవల విడుదలైన తమ సరికొత్త వెరిటో మార్కెట్లో మంచి ఆదరణను పొంది ఆగస్టు నెలలో సుమారు 2,000 యూనిట్లకు పైగా అమ్ముడు పోయాయని చెప్పారు.
గడచిన నెలలో కొత్త వెరిటో మహీంద్రాను అమ్మకాల పరంగా లాభాల బాటలో నడిపించగా, ఈ నెల మహీంద్రా కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'క్వాంటో' కంపెనీకు లాభాలు తెచ్చిపెట్టనుంది. పాపులర్ మహీంద్రా జైలో ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని చేసిన మహీంద్రా క్వాంటో ఈ నెల మూడవ వారంలో మార్కెట్లోకి రానున్న సంగతి తెలిసిందే. దీని ప్రారంభ ధర రూ.5-6 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications









