మహీంద్రా వెరిటో సెడాన్ ఫ్లాట్‌ఫామ్‌పై హ్యాచ్‌బ్యాక్ వెర్షన్

తాజాగా రిఫ్రెష్డ్ వెరిటో సెడాన్‌ను ప్రవేశపెట్టిన ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్), ఇదే ఫ్లాట్‌ఫామ్‌ను ఆదారంగా చేసుకొని ఇందులో ఓ హ్యాచ్‌బ్యాక్ వెర్షన్‌ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. కంపెనీ సీఈఓ ప్రవీణ్ షా ఈ విషయాన్ని ధృవీకరించారు. లోగాన్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రెనో భాగస్వామ్యంతో ఓ చిన్న కారును అభివృద్ధి చేసే అకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు.

లోగాన్‌ను తొలిసారిగా ఇండియాలో 2007లో ఫ్రెంచ్ కార్ మేకర్ రెనో సహకారంతో మహీంద్రా విడుదల చేసింది. మహీంద్రా-రెనో జాయింట్ వెంచర్‌లో రెనోకు 41 శాతం వాట ఉండేది. అయితే, ఈ జెవీ నష్టాల్లో నడవటంతో 2009లో రెనో మొత్తం వాటాను మహీంద్రా కొనుగోలు చేసింది. అంతేకాకుండా.. లోగాన్ కారును వెరిటోగా పేరు మార్చి కారు డిజైన్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్‌లలో మార్పులు చేసి మార్కెట్లో ప్రవేశపెట్టింది. వెరిటోగా పేరు మార్చి, మహీంద్రా బ్రాండ్‌తో విక్రయించడంతో ఈ కారు అమ్మకాలు జోరందుకున్నాయి.


ఈ నేపథ్యంలో వెరిటో అమ్మకాలను మరింత పెంచుకునేందుకు ఇందులో ఓ సరికొత్త రిఫ్రెష్డ్ వెర్షన్‌ను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే, ప్రస్తుతం చిన్న కార్ సెగ్మెంట్లో అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఈ సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించాలని మహీంద్రా యోచిస్తోంది. ఈ సెడాన్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా మార్కెట్లోకి రానున్న హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఇటు పెట్రోల్, అటు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫేస్‌లిఫ్టెడ్ మహీంద్రా వెరిటోను కేవలం రూ.527 లక్షల ప్రారంభ ధరకే (పెట్రోల్ వేరియంట్, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. 2012 మహీంద్రా వెరిటోలో లభించే వేరియంట్లు, ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

మహీంద్రా వెరిటో వేరియంట్లు, ధరలు:
మహీంద్రా వెరిటో 1.4 జి2 (పెట్రోల్) - రూ.5.27 లక్షలు
మహీంద్రా వెరిటో 1.4 జి4 (పెట్రోల్) - రూ.5.49 లక్షలు
మహీంద్రా వెరిటో 1.5 డి2 (డీజిల్) - రూ.6.26 లక్షలు
మహీంద్రా వెరిటో 1.5 డి4 (డీజిల్) - రూ.6.48 లక్షలు
మహీంద్రా వెరిటో 1.5 డి6 (డీజిల్) - రూ.7.14 లక్షలు

More from DriveSpark

Article Published On: Saturday, July 28, 2012, 13:29 [IST]
English summary
Mahindra is planning to develop a hatchback variant of the Verito sedan. The new car will be developed by Mahindra andn Renault. Renault had first launched the Logan in India which has now been renamed as the Verito
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+