రాష్ట్ర మార్కెట్లోకి మహీంద్రా ఆల్ఫా ప్లస్ లోడ్ క్యారియర్

యుటిలిటీ వాహనాల తయారీలో ప్రసిద్ధిగాంచిన మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) గడచిన మే నెలలో మార్కెట్లో విడుదల చేసిన 3 వీలర్‌ అల్ఫా లోడ్‌ కారియర్‌ "ఆల్ఫా ప్లస్" ఇప్పుడు రాష్ట మార్కెట్లో కూడా అందుబాటులోకి వచ్చింది. మినరల్ వాటర్, గ్యాస్ సిలిండర్స్, వినియోగ వస్తువులు వంటి వాటిని రవాణా చేసేందుకు వీలుగా, పొడవాటి డెక్‌తో కూడిన ఆల్ఫా ప్లస్‌ను ప్రత్యేకించి ఇంట్రా-సిటీ లోడ్ ట్రాన్స్‌పోర్ట్ కోసం డిజైన్ చేయటం జరిగింది.

పొడవాటి వీల్‌బేస్, ఆకర్షనీయమైన డిజైన్, సౌకర్యవంతమైన మరియు విశాలవంతమైన క్యాబిన్, పవర్‌ఫుల్ ఇంజన్, ఎక్సలెంట్ మైలేజ్ వంటి ఫీచర్లతో ఆల్ఫా ప్లస్ 3వీలర్ లోడ్ క్యారియర్‌ను కంపెనీ తీర్చిదిద్దింది. పొడవైన డెక్ (వెనుక ట్రక్కు) కారణంగా ఇది అధనంగా 20 శాతం అధిక లోడ్‌ను ఆఫర్ చేస్తుంది. 'పెద్ద ఆదాయం కోసం పెద్ద ఆల్ఫా' అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన కొత్త ఆల్ఫా నిజంగానే తన కస్టమర్లకు మంచి ఆదాయాలను చేకూర్చి పెడుతుంది.


మహీంద్రా ఆల్ఫా ప్లస్ క్యాబిన్ దూర ప్రయాణాల్లో కూడా సౌకర్యంగా ఉండేలా డిజైన్ చేశారు. ఇది సాధారణ ఆల్ఫాతో పోలిస్తే ఇది మరింత పొడవుగా వుంటుందని, నగర రోడ్లపై మరింత అధిక పేలోడ్‌తో వెళ్లేందుకు అనువుంగా ఉంటుందని మహీంద్రా అండ్ మహీంద్రా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్, ఆటోమోటివ్ డివిజన్) వివేక్‌ నాయర్‌ తెలిపారు. దీని గేర్‌ బాక్స్‌ జీవితకాలంలో 20 శాతం, ఇంజన్‌ టార్క్‌లో 8 శాతం అధిక పనితీరును కనబరుస్తుందని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Wednesday, June 27, 2012, 11:20 [IST]
English summary
India’s leading SUV manufacturer Mahindra & Mahindra Ltd. (M&M Ltd.), has launched the Alfa Plus, a longer deck variant of its 3 Wheeler Alfa Load carrier. Developed to enhance the value proposition for its customers, Alfa Plus has been designed for intra-city load transport, especially suited for the captive segments like the distributors of mineral water, gas cylinders and consumer goods.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+