మహీంద్రా మాక్సిమో మినీ ట్రక్‌లో సిఎన్‌జి వేరియంట్‌

ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న చిన్న తరహా వాణిజ్య వాహనం (ఎల్‌సివి) మాక్సిమోలో మరో సరికొత్త వేరియంట్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. పెట్రోల్, డీజిల్ సమస్యకు చెక్ పెడుతూ ఇందులో ఓ సిఎన్‌జి వేరియంట్ కంపెనీ విడుదల చేసింది. మహీంద్రా మాక్సిమో సిఎన్‌జి వెర్షన్ ధర రూ.3.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

చిన్న చిన్న వాణిజ్య అవసరాల నిమిత్తం రవాణా కార్యకలాపాలకు మహీంద్రా మాక్సిమో మినీ ట్రక్ చక్కగా సరిపోతుంది. అయితే, మహీంద్రా మోక్సిమో సిఎన్‌జి వెర్షన్ మినీ ట్రక్ పర్యావరణానికి హాని కలిగించకుండా మరింత మెరుగైన మైలేజీని అందించి, దీని యజమానులకు మంచి ఆదాయాలు చేకూర్చి పెడుతుందని కంపెనీ పేర్కొంది. కానీ సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) ఇంధన లభ్యత కొన్ని మెట్రో నగరాలకు మార్కెట్లకు మాత్రమే పరిమితమై ఉంది.


మహీంద్రా మాక్సిమో సిఎన్‌జి వెర్షన్‌లో ఉపయోగించిన 909సీసీ 4-స్ట్రోక్ స్పార్క్ ఇగ్నిషన్, వాటర్ కూల్డ్, 2-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 3600 ఆర్‌పిఎమ్ వద్ద 25.6 హెచ్‌పిల (18.8 కి.వా.) శక్తిని, 1600-2000 ఆర్‌పిఎమ్ వద్ద 57 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ర్యాక్ అండ్ పినియన్‌తో కూడిన మ్యాన్యువల్ స్టీరింగ్, 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, ముందు వైపు డిస్క్ బ్రేక్స్ మరియు వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్, 80 లీటర్స్ ఫ్యూయెల్ ట్యాంక్ ఆప్షన్లతో ఇది లభిస్తుంది.

మహీంద్రా మాక్సిమో సిఎన్‌జి మినీ ట్రక్ కార్గో బాక్స్ 2275 మి.మీ. పొడవును, 1540 మి.మీ. వెడల్పును కలిగి ఉండి మంచి స్పేస్‌ను ఇస్తుంది. ఇది 1840 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. లాంగ్ డ్రైవింగ్‌లకు సౌకర్యంగా ఉండేలా డిజైన్ చేసిన డ్రైవర్ క్యాబిన్‌లో డ్రైవర్‌తో పాటుగా మరొక ప్యాసింజర్‌కు కూడా చోటు ఉంటుంది. మహీంద్రా మాక్సిమో 750 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, June 30, 2012, 13:21 [IST]
English summary
Auto major Mahindra & Mahindra today launched a CNG variant of its mini truck 'Maxximo' priced at Rs 3.99 lakh (Ex showroom Delhi). The company is targeting transporters and corporate segment with the new product.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+