కొత్త బొలెరో మ్యాక్సీ ట్రక్‌ను విడుదల చేసిన మహీంద్రా

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి అత్యంత పాపులర్ అయిన మహీంద్రా బొలెరో ఎస్‌యూవీ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేసిన సరికొత్త బొలేరో మ్యాక్సీ ట్రక్‌ను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. పికప్ పోర్ట్‌ఫోలియోకు అధనంగా బొలేరో మ్యాక్సీ ట్రక్‌ను విడుదల చేస్తున్నామని, ఇది మరింత స్టయిలిష్‌గా ఉండి సుపీరియర్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

కొత్త బొలెరో మ్యాక్సీ ట్రక్‌లో ఉపయోగించిన 1523సీసీ ఎమ్‌డిఐ ఇంజన్ శక్తివంతమైన పెర్ఫామెన్స్‌ను కలిగి ఉండి మంచి లోడ్ క్యారీయింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సరికొత్త హెడ్‌ల్యాంప్స్, స్టయిలిష్ ఫ్రంట్ గ్రిల్‌లు బొలెరో మ్యాక్సీ ట్రక్‌కు స్పోర్టీ లుక్‌నిస్తాయి. పవర్ స్టీరింగ్‌లో లభించే బొలెరో మ్యాక్సీ ట్రక్‌ స్టాండర్డ్ బిఎస్ 3 వెర్షన్ ధర రూ.4.08 లక్షలు (ఎక్స్-షోరూమ్, కర్ణాటక)గా ఉంది. ఈ నెలాఖరుకు కొత్త బొలెరో మ్యాక్సీ ట్రక్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.


మహీంద్రా బొలెరో పికప్ కన్నా ఇది ధృఢమైన నిర్మాణాన్ని, నాణ్యమైన ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో అమర్చిన 1523సీసీ ఎమ్‌డిఐ డీజిల్ ఇంజన్ 62 బిహెచ్‌పిల శక్తిని, 183.5 ఎన్ఎమ్‌ల టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన సస్పెషన్, ఆధున టెక్నాలజీ, పవర్, పెర్ఫామెన్స్ విషయాల్లో ఈ సెగ్మెంట్లోకొత్త బొలెరో మ్యాక్సీ ట్రక్ అన్నింటికన్నా ముందుటుంది.

కొత్త బొలెరో మ్యాక్సీ ట్రక్ మెయింటినెన్స్ ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా రీసేల్ వ్యాల్యూ కూడా అధికంగా ఉంటుంది. దీని యజమానులకు ఇది అధిక లాభాలను చేకూర్చిపెడుతుంది. ఒక టన్ను పేలోడ్‌తో కూడా ఇది వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, ప్రతి లీటరు డీజిల్‌కు ఇది 16 కి.మీ. మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రాకస్టమర్ల అవసరాలకు అనుగుణంగా బొలెరో పికప్, బొలెరో మ్యాక్సీ ట్రక్, జెనియో వంటి మోడళ్లను అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 5, 2012, 12:04 [IST]
English summary
Mahindra and Mahindra Ltd. (M&M Ltd.) has launched the ‘New Bolero Maxi Truck’, an addition to its ‘pick-up’ portfolio. The Bolero Maxi Truck has undergone a makeover to become more stylish, and delivers a superior driving experience. The New Bolero Maxi Truck is powered by the trusted and proven 2523cc MDI engine, for ease of driveability in any terrain and effortless load carrying ability.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+