ఎయిర్ కండిషన్ థార్‌ను విడుదల చేసిన మహీంద్రా

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ "థార్"లో మరో సరికొత్త వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. మహీంద్రా తాజాగా విడుదల చేసిన సిఆర్‌డిఈ 4x4 ఎస్‌యూవీలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఎయిర్ కండిషనింగ్ (ఏసి), ఇంజన్ ఇమ్మొబిలైజర్‌లు స్టాండర్డ్ ఫీచర్లుగా ఉండే విధంగా ఓ సరికొత్త వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది.

మహీంద్రా థార్ ఎస్‌యూవీని ఆఫ్-రోడ్ అడ్వెంచర్ రైడ్‌లంటే ఇష్టపడేవారు, యువకులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అలాగే, తమ రోజూవారీ కార్యకలాపాల కోసం కూడా కొందరు ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేస్తారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని, ప్రస్తుతం వేసవి సీజన్ కూడా కావడంతో ఎయిర్ కండిషనింగ్‌తో కూడుకున్న ఈ సరికొత్త వేరియంట్‌ను మహీంద్రా అండ్ మార్కెట్లోకి తీసుకు వచ్చింది.

కేవలం సిఆర్‌డి వెర్షన్‌లో మాత్రమే ఏసి ఫీచర్‌ను పరిచయం చేయటం జరిగింది. కాగా.. డిఐ వేరియంట్ థార్ ఏసి లేకుండా మార్కెట్లో లభిస్తుంది. ఏసి వేరియంట్ థార్‌ ధరను రూ.6,86,800 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ఈ వేరియంట్లో ఉపయోగించిన 2.5 లీటర్ సిఆర్‌డిఈ కామన్ రైల్ టర్బో డీజిల్ ఇంజన్ 105 బిహెచ్‌పిల శక్తిని, 247 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, April 6, 2012, 12:27 [IST]
English summary
Leading SUV manufacturer Mahindra and Mahindra has launched the new 2012 Thar CRDe with factory fitted AC and engine immobilizer at the price of Rs 6.86 lakhs ex-showroom Delhi. Mahindra Thar is powered by 2.5 liter common rail turbo diesel engine, which generates 105 Bhp and 247 Nm.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+